పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : ఋశ్యశృంగుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-695-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు హరిణీసుతుండు కాంతాకటాక్షపాశబద్దుండై, వారల వెంటం జని, రోమపాదుకడకుం బోయిన, నతండు దన ప్రియనందన యైన శాంతనిచ్చి పురంబు ననునిచికొనియె; నమ్మునీశ్వరుండు వచ్చిన వర్షప్రతిబంధదోషంబు చెడి వర్షంబు గురిసె; నంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; హరిణీసుతుండు = ఋష్యశృంగుడు {హరిణీసుతుడు - విభాండకమునికి లేడి యందు కలిగినవాడు, ఋశ్యశృంగుడు}; కాంతా = వారవనితల; కటాక్ష = కడకంటి చూపులు అనెడి; పాశ = పాశములకు; బద్దుండు = కట్టుబడినవాడు; ఐ = అయ్యి; వారలన్ = వారి; వెంటన్ = కూడా; చని = వెళ్ళి; రోమపాదు = రోమపాదుని; కడ = వద్ద; కున్ = కు; పోయినన్ = వెళ్ళగా; అతండు = అతను; తన = తన యొక్క; ప్రియ = ఇష్ట; నందనన్ = పుత్రిక; ఐన = అయిన; శాంతన్ = శాంతని; ఇచ్చి = వివాహమునందు ఇచ్చి; పురంబున్ = నగరమున; ఉనిచికొనియెన్ = ఉంచుకొనెను; ఆ = ఆ; ముని = మునులలో; ఈశ్వరుండున్ = శ్రేష్ఠుడు; వచ్చినన్ = రాగా; వర్ష = వానలను; ప్రతిబంధ = అడ్డుకొనెడి; దోషంబున్ = దోషములు; చెడి = తొలగిపోయి; వర్షంబున్ = వానలు; కురుసెను = కురిసినవి; అంత = తరవాత.

భావము:

ఇలా ఋష్యశృంగుడు ఆ వారవనితల వాలు చూపుల వలలకు చిక్కి వారి వెంట రోమపాదుని వద్దకు వెళ్ళాడు. అతను తన ఇష్ట పుత్రిక అయిన శాంతని ఇచ్చి వివాహం చేసి నగరంలో ఉంచుకున్నాడు. ఆ మునిశ్రేష్ఠుడు రాగా అనావృష్టి దోషాలు తొలగిపోయి వానలు కురిసాయి. పిమ్మట.