పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : ఋశ్యశృంగుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-694-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"క్షేమమే" యని సతుల్ చేతుల గ్రుచ్చి క-
ర్కశకుచంబులు మోవఁ గౌఁగలించి
"చిరతపోనియతి డస్సితిగదా" యని మోముఁ-
గంఠంబు నాభియుఁ లయఁ బుడికి
"క్రొత్తదీవన లివి గొను"మని వీనుల-
పొంత నాలుకలఁ జప్పుళ్ళు చేసి
"మా వనంబుల పండ్లు మంచివి తిను"మని-
పెక్కు భక్ష్యంబులు ప్రీతి నొసఁగి

9-694.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నూతనాజినంబు నునుపిది మే"లని
గోఁచి విడిచి మృదు దుకూలమిచ్చి
మౌని మరగఁజేసి "మా పర్ణశాలకుఁ
బోద" మనుచుఁ గొంచుఁబోయి రతని.

టీకా:

క్షేమమే = కులాసా ఉన్నావా; అని = అని; సతుల్ = కాంతలు; చేతులన్ = చేతులలో చేతులను; గ్రుచ్చి = కలిపి నొక్కి; కర్కశ = గట్టివైన; కుచంబులున్ = స్తనములు; మోవన్ = ఒత్తునట్లుగా; కౌగలించి = కొగలించుకొని; చిర = అధికమైన; తపః = తపస్సు నందు; నియతిన్ = లగ్నమగుటచేత; డస్సితికదా = అలసిపోతివి; అని = అని; మోమున్ = ముఖమును; కంఠంబున్ = మెడ; నాభిన్ = బొడ్డు; కలయ = తాకుతు; పుడికి = పుణికి; క్రొత్త = కొత్తరకమైన; దీవనలు = ఆశీస్సులు; ఇవి = ఇవి; కొనుము = తీసికొనుము; అని = అని; వీనుల = చెవుల; పొంతన్ = దగ్గర; నాలుకలన్ = నాలుకలతో; చప్పుళ్ళు = చప్పుడులు; చేసి = చేసి; మా = మా యొక్క; వనంబులన్ = ఆరామము లందలి; పండ్లు = పళ్ళు; మంచివి = మంచివి; తినుము = ఆరగించుము; అని = అని; పెక్కు = అనేక; భక్ష్యంబులున్ = తినుబండారములను; ప్రీతిన్ = ప్రేమగా; ఒసగి = పెట్టి.
నూతన = కొత్తరకమైన; అజినంబున్ = జింకచర్మము; నునుపిది = నున్నటిది; మేలు = బాగుంటుది; అని = అని; గోచిన్ = గోచీని; విడిచి = బదులుగా; మృదు = మెత్తని; దుకూలమున్ = మేలైనవస్త్రములు; ఇచ్చి = కట్టించి; మౌనిన్ = ఋషిని; మరగన్ = మోహింప; చేసి = చేసి; మా = మా యొక్క; పర్ణశాల = పాక; కున్ = కు; పోదము = వెళ్లెదము; అనుచున్ = అనుచు; కొంచుబోయిరి = తీసుకెళ్ళిరి; అతని = అతనిని;

భావము:

“కులాసాగా ఉన్నావా” అని కాంతలు చేతిలో చేతులు వేసి నొక్కసాగారు. తమ కఠిన స్తనాలు ఒత్తుకొనేలా కౌగలించుకో సాగారు. “చాలా సేపు తపస్సు చేసి అలసిపోయావే” అని ముఖము, మెడ, బొడ్డు, తాకుసాగారు. “ఇవి కొత్తరకం ఆశీస్సులు తీసికో” అని చెవుల దగ్గర నాలుకలతో చప్పుడులు చేయసాగారు. “మా వద్ద లభించే మంచి పళ్ళు ఆరగించు.” అని అనేక రకాల తినిబండారాలను ప్రేమగా పెట్టసాగారు. “కొత్తరకం నున్నటి జింకచర్మం బాగుంటుది” అని గోచీ బదులుగా మెత్తని మేలిమివస్త్రాలు కట్టించసాగారు. అలా అతనిని వశీకరించుకుని “మా పర్ణశాలకు వెళ్దాం. రా” అంటూ వెంట తీసుకెళ్ళారు.