పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : ఋశ్యశృంగుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-692.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధురగానంబు శ్రుతియుక్తమంత్రజాతు
నియు, వీణెలు దండంబు నియు, సతుల
మూర్తు లెన్నఁడు నెఱుఁగని ముగుద తపసి
వారిఁ దాపసులని డాయచ్చి మ్రొక్కె.

టీకా:

మిళితా = తుమ్మెదలవంటి; నీల = నల్లని; ధమిల్ల = కొప్పుల; భారంబులన్ = దట్టమైనవానిని; చారు = మనోహరమైన; జట = జటలలోని; విశేషంబులు = రకములు; అనియున్ = అని; భర్మ = బంగారపు; అంచల = జరీతో; ఉజ్వల = ప్రకాశవంతమైన; ప్రభ = మెరుపుకల; దుకూలంబులున్ = శ్రేష్ఠమైన వలువలు; తత = మెత్తని; చర్మవస్త్ర = మృగచర్మపు బట్టలలో; భేదంబులు = రకములు; అనియున్ = అని; బహు = అనేక; రత్న = రత్నములు; కీలిత = పొదగిన; భాసుర = ప్రకాశవంతమైన; హారంబులు = దండలు; అధిక = గొప్ప; రుద్రాక్ష = రుద్రాక్షల; మాల = మాలలు; ఆదులు = మున్నగునవి; అనియున్ = అని; మలయజ = చందనము; మృగనాభి = కస్తూరి; మహిత = గొప్ప; లేపంబులున్ = మైపూతలు; బహు = అనేక; విధ = రకముల; భూతి = విభూతి; లేపంబులున్ = పూతలు; అనియున్ = అని.
మధుర = తియ్యని; గానంబు = పాటలు; శ్రుతి = శ్రుతి; యుక్త = బద్ద; మంత్ర = వేదమంత్రములు; జాతులు = జతులు; అనియున్ = అని; వీణెలు = వీణలు; దండంబులు = యోగదండములు; అనియున్ = అని; సతుల = స్త్రీల; మూర్తులన్ = పొడలు; ఎన్నడున్ = ఎప్పుడును; ఎఱుగని = తెలియని; ముగుద = మగ్ద; తపసి = ఋషి; వారిన్ = వారిని; తాపసులు = మునులు; అని = అనుకొని; డాయన్ = దగ్గరకుచేర; వచ్చి = వచ్చి; మ్రొక్కెన్ = నమస్కరించెను.

భావము:

స్త్రీల పొడ ఎరుగని ముగ్ధ ఋషి వారిని చూసి, తుమ్మెదల వంటి నల్లని దట్టమైన కొప్పులని చూసి వాటిని మనోహరమైన జటలలో రకాలు అనుకున్నాడు. బంగారపు జరీతో ప్రకాశవంతమైన మెరుస్తున్న మేలిమి వలువలు, మెత్తని మృగచర్మాలలో రకాలు అనుకున్నాడు. బహు రత్న ఖచితమైన మెఱుగు దండలను, గొప్ప రుద్రాక్ష మాలలు వంటివి అనుకున్నాడు. చందనం కస్తూరి వంటి గొప్ప మైపూతలను, రక రకాల విభూతి పూతలు అని. తియ్యని పాటలను, శ్రుతి బద్ద వేదమంత్రాలని జతులని, వీణలను యోగదండాలు అని అనుకుని ఆశ్చర్యంగా చూసాడు. వారిని మునులు అనుకొని దగ్గరకు వచ్చి నమస్కరించాడు.