పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : ఋశ్యశృంగుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-686-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజు ఋశ్యశృంగుని
ఘోతపోనియముఁ దెచ్చుకొఱకై పనిచెన్
వాసతుల నేర్పరుల ను
దాస్తనభారభీరురమధ్యగలన్.

టీకా:

ఆ = ఆ; రాజు = రాజు; ఋశ్యశృంగుని = ఋశ్యశృంగుని; ఘోర = గట్టి; తపస్ = తపస్సు; నియమమును = నియమములు కలవానిని; తెచ్చు = తీసుకొచ్చుట; కొఱకున్ = కోసము; ఐ = అయ్యి; పనిచెన్ = పంపించెను; వారసతులన్ = వేశ్యలను; నేర్పరులను = నెఱజాణలైనవారిని; ఉదార = గొప్ప; స్తన = కుచ; భార = భారముచే; భీరుతర = మిక్కిలి చిక్కిన,సన్నని; మధ్యగలన్ = నడుములు కలవారిని.

భావము:

ఆ రాజు గొప్ప నియమాలతో తపస్సు చేసుకుంటున్న ఋశ్యశృంగుని తీసుకురావడం కోసం అందమైన నెఱజాణలను పంపించాడు.