పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : భీష్ముని వృత్తాంతము

  •  
  •  
  •  

9-670-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బాదరాయణుండు గవంతుఁ డనఘుండు
రమగుహ్యమైన భాగవతము
నందనుండ నయిన నాకుఁ జెప్పెను శిష్య
నుల మొఱఁగి యేను దువుకొంటి.

టీకా:

బాదరాయణుండు = వ్యాసమహర్షి; భగవంతుడు = మహిమాన్వితుడు; అనఘుడ = పుణ్యుడు; పరమ = అతి; గుహ్యము = గోప్యము; ఐన = అయిన; భాగవతమున్ = భాగవతమును; నందనుండన్ = పుత్రుడను; అయిన = ఐన; నా = నా; కున్ = కు; చెప్పెను = తెలిపెను; శిష్యజనులన్ = ఇతర శిష్యులను; మొఱగి = అతిక్రమించి; ఏను = నేను; చదువుకొంటిన్ = చదువుకొన్నాను.

భావము:

వ్యాసమహర్షి మహిమాన్వితుడు, మహా పుణ్యుడు. అతి గోప్యం అయిన భాగవతాన్ని పుత్రుడనైన నాకు చెప్పాడు. రహస్యంగా నేను చదువుకొన్నాను.