పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : బృహద్రథుని వృత్తాంతము

  •  
  •  
  •  

9-661-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ జయత్సేనునికి రథికుండు, రథికునకు నయుతాయువు, నయుతాయువునకుఁ గ్రోధనుండు, గ్రోధనునకు దేవాతిథియు, దేవాతిథికి ఋక్షుండు, ఋక్షునికి భీమసేనుండు, వానికిఁ బ్రతీపుండుఁ, బ్రతీపునకు దేవాపి శంతను బాహ్లికు లన మువ్వురు గొడుకులు పుట్టి; రందు.

టీకా:

ఆ = ఆ; జయేసేనుని = జయత్సేనుని; కిన్ = కి; రథికుండు = రథికుడు; రథికున్ = రథికున; కున్ = కు; అయుతాయువున్ = అయుతాయువు; అయుతాయువున్ = అయుతాయువున; కున్ = కు; క్రోధనుండున్ = క్రోధనుడు; క్రోధనున్ = క్రోధనున; కున్ = కు; దేవాతిథియున్ = దేవాతిథి; దేవాతిథి = దేవాతిథి; కిన్ = కి; ఋక్షుండున్ = ఋక్షుడు; ఋక్షుని = ఋక్షుని; కిన్ = కి; భీమసేనుండున్ = భీమసేనుడు; వాని = అతని; కిన్ = కి; ప్రతీపుండున్ = ప్రతీపుడు; ప్రతీపున్ = ప్రతీపున; కున్ = కు; దేవాపి = దేవాపి; శంతను = శంతనుడు; బాహ్లికులు = బాహ్లికుడు; అనన్ = అనెడి; మువ్వురున్ = ముగ్గురు; కొడుకులున్ = పుత్రులు; పుట్టిరి = జన్మించిరి; అందున్ = వారిలో.

భావము:

ఆ జయత్సేనునికి రథికుడు; రథికునకు అయుతాయువు; అయుతాయువునకు క్రోధనుడు; క్రోధనునకు దేవాతిథి; దేవాతిథికి ఋక్షుడు; ఋక్షునికి భీమసేనుడు; అతనికి ప్రతీపుడు; ప్రతీపునకు దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అని ముగ్గురు పుత్రులు కలిగారు వారిలో.