పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : బృహద్రథుని వృత్తాంతము

 •  
 •  
 •  

9-660-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

బృహద్రథునకు న్య భార్యాగర్భ-
మున రెండు తనుఖండములు జనించె
దునుకలుగని తల్లి తొలఁగంగ వైచిన-
సంధించె నొకటిగా ర యనంగ
నొక దైత్యకాంత; వాఁడొప్పె జరాసంధుఁ-
న; గిరివ్రజపుర మాతఁ డేలె;
తనికి సహదేవుఁ; తనికి సోమాపి-
నయుఁ; డాతనికి శ్రుశ్రవుండు

9-660.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

హ్నుపుత్రుండు సురథుండు నవరేణ్య!
తని కొడుకు విదూరథుఁ; తని పట్టి
సార్వభౌముండు; వానికి సంభవుండు
విను జయత్సేనుఁ డనువాఁడు విమలకీర్తి!

టీకా:

ఆ = ఆ; బృహద్రథున్ = బృహద్రథున; కున్ = కు; అన్య = ఇతర; భార్యా = భార్య యొక్క; గర్భమున = కడుపులో; రెండు = రెండు; తను = శరీరపు; ఖండములు = ముక్కలు; జనించెన్ = పుట్టినవి; తునుకలున్ = ముక్కలను; కని = కనుగొని; తల్లి = తల్లి; తొలగంగవైచినన్ = పారవేయగా; సంధించెన్ = కలిపెను; ఒకటి = ఒకటే; కాన్ = అగునట్లు; జర = జర; అనంగన్ = అనెడి; ఒక = ఒకానొక; దైత్య = దానవ; కాంత = స్త్రీ; వాడున్ = అతడు; ఒప్పెన్ = చక్కగా నుండెను; జరాసంధుడు = జరాసంధుడు; అనన్ = అని పిలువబడి; గిరివ్రజపురమున్ = గిరివ్రజపురమును; ఆతడున్ = అతను; ఏలెన్ = పరిపాలించెను; అతని = అతని; కిన్ = కి; సహదేవుడు = సహదేవుడు; అతని = అతని; కిన్ = కి; సోమాపి = సోమాపి; తనయుడు = పుత్రుడు; ఆతని = అతని; కిన్ = కి; శ్రుతశ్రవుండు = శ్రుతశ్రవుడు.
జహ్నుపుత్రుండు = జహ్నుపుత్రుడు; సురథుండున్ = సురథుడు; జనవరేణ్య = రాజా; అతని = అతని; కొడుకు = పుత్రుడు; విదూరథుడు = విదూరథుడు; అతని = అతని; పట్టి = పుత్రుడు; సార్వభౌముండు = సార్వభౌముడు; వాని = అతని; కిన్ = కి; సంభవుండు = పుట్టినవాడు; విను = వినుము; జయత్సేనుడు = జయత్సేనుడు; అను = అనెడి; వాడు = వాడు; విమలకీర్తి = స్వచ్ఛమైన కీర్తికలవాడ.

భావము:

మహారాజా! ఆ బృహద్రథునకు ఇతర భార్య కడుపులో రెండు భాగాలు అయిన శిశువు పుట్టింది. ముక్కలై పోయిందని ఆ శిశువును తల్లి పారవేసింది. జర అనె రాక్షసవనిత ఆ రెండు భాగాలను సంధించింది. అలా బ్రతికిన వాడు కనుక జరాసంధుడు అన్నారు. అతను గిరివ్రజపురాన్ని పరిపాలించాడు. అతనికి సహదేవుడు; అతనికి సోమాపి; అతనికి శ్రుతశ్రవుడు పుట్టారు. జహ్నువు పుత్రుడు సురథుడు; అతని పుత్రుడు విదూరథుడు; అతని పుత్రుడు సార్వభౌముడు; అతని పుత్రుడు జయత్సేనుడు. అతను నిర్మలకీర్తి పొందాడు.