పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : రంతిదేవుని చరిత్రము

  •  
  •  
  •  

9-655-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆ బ్రహ్మదత్తుండు జైగిషవ్యోపదేశంబున, యోగతంత్రంబునం జేసి గోదేవియను భార్యవలన విష్వక్సేనుండను కుమారునిం గనియె; విష్వక్సేనునకు నుదక్సేనుండు, నుదక్సేనునకు భల్లాదుండు గల్గి, వీరలు బార్హదిషవులను రాజులైరి; ద్విమీఢునకు యమీనరుండు, యమీనరునికిఁ గృతిమంతుండు, గృతిమంతునికి సత్యధృతి, సత్యధృతికి దృఢనేమి, దృఢనేమికి సుపార్శ్వకృత్తు, సుపార్శ్వకృత్తునకు సుపార్శ్వుండును, సుపార్శ్వునకు సుమతి, సుమతికి సన్నతిమంతుండు, సన్నతిమంతుని కొడుకు కృతి యనువాఁడు హిరణ్యనాభునివలన యోగమార్గం బెఱింగి, శోకమోహంబులు విడిచి తూర్పుదేశంబున సామసంహిత పఠియించె; నతనికి నుగ్రాయుధుండును, నుగ్రాయుధునకు క్షేమ్యుండు. క్షేమ్యునకు సువీరుండు, సువీరునకుఁ బురంజయుండుఁ, బురంజయునకు బహురథుండు జన్మించిరి; హస్తి కొడుకు పురుమీఢునికి సంతతి లేదయ్యె; నయ్యజమీఢునికి నళిని యను భార్య యందు నీలుండు నీలునికి శాంతియు, శాంతికి సుశాంతియు, సుశాంతికిఁ బురుజుండు, బురుజునికి నర్కుండు, నర్కునికి భర్మ్యాశ్వుండు, భర్మ్యాశ్వునకు ముద్గల యవీనర బృహదిషు కాంపిల్య సృంజయులను వారేరువురుం బుట్టిరి.

టీకా:

ఆ = ఆ; బ్రహ్మదత్తుండున్ = బ్రహ్మదత్తుడు; జైగిషవ్య = జైగిషవ్యుని; ఉపదేశంబునన్ = ఉపదేశము పొందుట వలన; యోగతంత్రంబునన్ = యోగతంత్రము; జేసి = వలన; గోదేవి = గోదేవి; అను = అనెడి; భార్య = భార్య; వలనన్ = అందు; విష్వక్సేనుండు = విష్వక్సేనుడు; అను = అనెడి; కుమారునిన్ = పుత్రుని; కనియెన్ = పొందెను; విష్వక్సేనున్ = విష్వక్సేనున; కున్ = కు; ఉదక్సేనుండును = ఉదక్సేనుడు; ఉదక్సేనున్ = ఉదక్సేనున; కున్ = కు; భల్లాదుండున్ = భల్లాదుడు; కల్గి = పుట్టి; వీరలు = వీరు; బార్షదిషువులు = బార్షదిషువులు; అను = అనెడి; రాజులు = రాజులు; ఐరి = అయ్యిరి; ద్విమీఢున్ = ద్విమీఢున్; కున్ = కు; అమీనరుండున్ = అమీనరుండు; అమీనరుని = అమీనరుని; కిన్ = కి; కృతిమంతుడున్ = కృతిమంతుడు; కృతిమంతుని = కృతిమంతుని; కిన్ = కి; సత్యధృతి = సత్యధృతి; సత్యధృతి = సత్యధృతి; కిన్ = కి; దృఢనేమి = దృఢనేమి; దృఢనేమి = దృఢనేమి; కిన్ = కి; సుపార్శ్వకృత్తు = సుపార్శ్వకృత్తు; సుపార్శ్వకృత్తున్ = సుపార్శ్వకృత్తున; కున్ = కు; సుపార్శ్వుండును = సుపార్శ్వుడు; సుపార్శ్వున్ = సుపార్శ్వున; కున్ = కు; సుమతి = సుమతి; సుమతి = సుమతి; కిన్ = కి; సన్నతిమంతుండున్ = సన్నతిమంతుడు; సన్నతిమంతుని = సన్నతిమంతుని; కొడుకు = పుత్రుడు; కృతి = కృతి; అను = అనెడి; వాడు = వాడు; హిరణ్యనాభుని = హిరణ్యనాభుని; వలనన్ = వలన; యోగమార్గంబున్ = యోగమార్గమును; ఎఱింగి = తెలిసికొని; శోకమోహంబులున్ = శోకమోహములను; విడిచి = వదలివేసి; తూర్పు = తూర్పు దిక్కునగల; దేశంబునన్ = దేశములలో; సామసంహిత = సామవేదభాగమును; పఠియించెన్ = చదువుకొనెను; అతని = అతని; కిన్ = కి; ఉగ్రాయుధుండునున్ = ఉగ్రాయుధుడు; ఉగ్రాయుధున్ = ఉగ్రాయుధున; కున్ = కు; క్షేముండున్ = క్షేముండు; క్షేమున్ = క్షేమున; కున్ = కు; సువీరుండు = సువీరుడు; సువీరున్ = సువీరున; కున్ = కు; పురంజయుండున్ = పురంజయుడు; పురంజయున్ = పురంజయున; కున్ = కు; బహురథుండున్ = బహురథుడు; జన్మించిరి = పుట్టిరి; హస్తి = హస్తి యొక్క; కొడుకు = పుత్రుడు; పురుమీఢుని = పురుమీఢుని; కిన్ = కి; సంతతి = సంతతి; లేదు = లేకపోయినది; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; అజమీఢుని = అజమీఢుని; కిన్ = కి; నళిని = నళిని; అను = అనెడి; భార్య = పెండ్లాము; అందున్ = వలన; నీలుండున్ = నీలుడు; నీలుని = నీలుని; కిన్ = కి; శాంతియున్ = శాంతి; శాంతి = శాంతి; కిన్ = కి; సుశాంతియున్ = సుశాంతి; సుశాంతి = సుశాంతి; కిన్ = కి; పురుజుండున్ = పురుజుండును; పురుజుని = పురుజుని; కిన్ = కి; అర్కుండున్ = అర్కుడు; అర్కుని = అర్కుని; కిన్ = కి; భర్మ్మాశ్వుండున్ = భర్మ్మాశ్వుడు; భర్మ్యాశ్వున్ = భర్మ్యాశ్వున; కున్ = కు; ముద్గల = ముద్గల; అవీనర = అవీనర; బృహదిషు = బృహదిషుడు; కాంపిల్య = కాంపిల్యుడు; సృంజయులు = సృంజయుడులు; అను = అనెడి; వారు = వారు; ఏవురు = ఐదుగురు (5); పుట్టిరి = జనించిరి.

భావము:

ఆ బ్రహ్మదత్తుడు జైగిషవ్యుని ఉపదేశం పొంది, యోగతంత్రంతో భార్య గోదేవి అందు విష్వక్సేనుడు అనే పుత్రుని పొందాడు. విష్వక్సేనునకు ఉదక్సేనుడు; ఉదక్సేనునకు భల్లాదుడు పుట్టారు. వీరు బార్షదిషువులు అనే రాజులు. ద్విమీఢునకు అమీనరుడు; అమీనరునికి కృతిమంతుడు; కృతిమంతునికి సత్యధృతి; సత్యధృతికి దృఢనేమి; దృఢనేమికి సుపార్శ్వకృత్తు; సుపార్శ్వకృత్తునకు సుపార్శ్వుడు; సుపార్శ్వునకు సుమతి; సుమతికి సన్నతిమంతుడు; సన్నతిమంతునికి కృతి పుట్టారు. ఆ కృతి హిరణ్యనాభుని నుండి యోగమార్గం తెలిసికొని శోకమోహాలను వదలివేసి తూర్పు దేశాలలో సామవేదభాగాన్ని చదువుకున్నాడు. అతనికి ఉగ్రాయుధుడు; ఉగ్రాయుధునకు క్షేముడు; క్షేమునకు సువీరుడు; సువీరునకు పురంజయుడు; పురంజయునకు బహురథుడు పుట్టారు. హస్తి పుత్రుడు పురుమీఢునికి సంతతి కలుగలేదు. అజమీఢునికి భార్య నళిని అందు నీలుడు; నీలునికి శాంతి; శాంతికి సుశాంతి; సుశాంతికి పురుజుడు; పురుజునికి అర్కుడు; అర్కునికి భర్మ్మాశ్వుడు; భర్మ్యాశ్వునకు ముద్గల, అవీనర, బృహదిషుడు, కాంపిల్యుడు, సృంజయుడు అనే ఐదుగురు కొడుకుల జన్మించారు.