పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : రంతిదేవుని చరిత్రము

  •  
  •  
  •  

9-654-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శుకుని కూఁతురైన సుందరి సత్కృతిఁ
బొంది వేడ్క నీపభూవిభుండు
విమల యోగవిత్తు విజ్ఞానదీపితో
దారచిత్తు బ్రహ్మత్తుఁ గనియె.

టీకా:

శుకుని = శుకుని యొక్క; కూతురు = పుత్రిక; ఐన = అయిన; సుందరి = అందగత్తె; సత్కృతిన్ = సత్కృతిని; పొంది = పెళ్ళిచేసుకొని; వేడ్కన్ = కోరి; నీప = నీపుడు అనెడి; భూవిభుండు = రాజు; విమల = స్వచ్ఛమైన; యోగ = యోగవిద్య; విత్తు = తెలిసినవాడు; విజ్ఞాన = విజ్ఞానముచేత; దీపిత = ప్రకాశించెడివాడు; ఉదారచిత్తు = గొప్ప మనసు కలవాడు; బ్రహ్మదత్తున్ = బ్రహ్మదత్తుని; కనియె = పొందెను.

భావము:

శుకుని పుత్రిక అయిన అందగత్తె సత్కృతిని నీపరాజు కోరి పెళ్ళిచేసుకొని, మంచి యోగవిద్య తెలిసి, విజ్ఞానంతో మెరిసే గొప్ప మనసు కలవాడు అయిన బ్రహ్మదత్తుని పొందాడు.