పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : రంతిదేవుని చరిత్రము

  •  
  •  
  •  

9-652-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజర్షిని గొలిచిన
వారెల్లఁ దదీయ యోగవైభవమున శ్రీ
నారాయణ చింతనులై
చేరిరి యోగీశులగుచు సిద్దపదంబున్.

టీకా:

ఆ = ఆ; రాజర్షినిన్ = రాజులలో ఋషి యైనవాని; కొలిచిన = సేవించిన; వారు = వారు; ఎల్ల = అందరు; తదీయ = అతని; యోగ = యోగ; వైభవమునన్ = మహిమవలన; శ్రీనారాయణ = శ్రీమన్నారాయణ; చింతనులు = చింతన గలవారు; ఐ = అయ్యి; చేరిరి = చేరుకొంటిరి; యోగి = యోగులల్; ఈశులు = శ్రేష్ఠులు; అగుచున్ = అగుచు; సిద్దపదంబున్ = సిద్దలోకమును.

భావము:

ఆ రాజర్షి రంతిదేవుని సేవించిన వారు అందరు. అతని యోగ మహిమ వల్ల, హరిచింతనా పరులు అవుతారు. యోగిశ్రేష్ఠులు అయ్యి సిద్దపదం చేరతారు.