పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : రంతిదేవుని చరిత్రము

  •  
  •  
  •  

9-649-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వంతంబగు నీరుపట్టున నిజప్రాణాంతమై యున్నచో
యం డేమియు; వీని హృజ్వరము నాయాసంబు ఖేదంబు నా
దానంబున నేఁడు మాను" ననుచున్ ర్వేశ్వరాధీనుఁడై
ముం బోసెను రంతిదేవుఁడు దయం జండాలపాత్రంబునన్.

టీకా:

బలవంతుంబు = తట్టుకోరానిది; అగు = అయినట్టి; నీరుపట్టునన్ = దాహమువలన; నిజ = తన; ప్రాణ = పాణములు; అంతము = కడముట్టుతున్నవి; ఐ = అయ్యి; ఉన్నచోన్ = ఉండగా; అలయండు = లెక్కజేయడు; ఏమియున్ = ఏమాత్రము; వీనిన్ = ఇతని; హృ = హృదయము నందలి; జ్వరమున్ = బాధ; ఆయాసంబున్ = అలసట; ఖేదంబున్ = చీకాకులు; నా = నా యొక్క; జలదానంబునన్ = జలదానమువలన; నేడు = ఇవాళ; మానున్ = తొలగిపోవును; అనుచున్ = అనుచు; సర్వేశ్వర = భగవంతునికి; అధీనుండు = అంకితమైనవాడు; ఐ = అయ్యి; జలమున్ = నీటిని; పోసెన్ = పోసెను; రంతిదేవుడు = రంతిదేవుడు; దయన్ = కరుణతో; చండాల = చండాలుని; పాత్రంబునన్ = గిన్నెలో.

భావము:

తట్టుకోరాని దాహంతో తన పాణాలు కడగడుతున్నా లెక్కజేయక, “ఇతని హృదయ బాధలు, చీకాకులు అన్నీ ఈ జలదానంతో తీరిపోవు గాక.” అంటూ, రంతిదేవుడు మిక్కిలి దయతో భగవదర్పణంగా చండాలుని గిన్నెలో నీటిని పోసాడు.