పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : రంతిదేవుని చరిత్రము

  •  
  •  
  •  

9-645-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"హీనుఁడఁ జండాలుండను
మావకులనాథ! దప్పి మానదు; నవలం
బోనేర; నీకుఁ జిక్కిన
పానీయము నాకుఁ బోసి బ్రతికింపఁగదే."

టీకా:

హీనుడన్ = హీనుడను; చండాలుండను = పంచముడను; మానవకులనాథ = రాజా; దప్పి = దాహము; మానదు = తీరుటలేదు; అవలన్ = అవతలకు; పోనేరన్ = వెళ్ళలేకున్నాను; నీ = నీ; కున్ = కు; చిక్కిని = దొరకిన; పానీయము = నీరు; నా = నా; కున్ = కు; పోసి = ఇచ్చి; బ్రతికింపగదే = నా ప్రాణములు నిలబెట్టు.

భావము:

“రాజా! దిక్కుమాలినవాడిని, పంచముడిని, దాహంతో అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. నీ దగ్గర ఉన్న నీళ్ళు నాకు ఇచ్చి నా ప్రాణాలు నిలబెట్టు.”