పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : రంతిదేవుని చరిత్రము

  •  
  •  
  •  

9-642-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజవంశోత్తమ! రంతిదేవుని కీర్తి-
యేల చెప్పఁగ? విను మిందు నందు
నా రాజు దన సంచితార్థంబు లన్నియు-
నెడపక దీనుల కిచ్చియిచ్చి
కుటుంబుఁడై ధైర్యసంయుతుండై పేద-
యై కూడు నీరులే ధమవృత్తి
నెందేని నలువదియెనిమిది దివసముల్-
రియింప నొకదివసంబు రేపు

9-642.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నెయ్యి పాయసంబు నీరును గలిగిన
హుకుటుంబభారయముతోడ
లసి నీరుపట్టు నాకలియును మిక్కి
లొదవఁ జూచి కుడువ నుత్సహించె.

టీకా:

రాజవంశ = క్షత్రియులలో; ఉత్తమ = శ్రేష్ఠుడా; రంతిదేవుని = రంతిదేవుని; కీర్తి = యశస్సు; ఏల = ఏమి; చెప్పగన్ = చెప్పగలము; వినుము = వినుము; ఇందున్ = ఇహలోకముల; అందున్ = పరలోకమున; ఆ = ఆ; రాజు = రాజు; తన = తను; సంచిత = కూడబెట్టిన; అర్థంబులు = సంపదలు; అన్నియున్ = సమస్తము; ఎడపక = వదలకుండ; దీనుల్ = బీదల; కున్ = కు; యిచ్చి = దానముచేసి; సకుటుంబుడు = పెళ్ళంపిల్లలతో నున్నవాడు; ఐ = అయ్యి; ధైర్య = ధైర్యము; సంయుతుండు = తోకూడినవాడు; ఐ = అయ్యి; పేద = పేదవాడు; ఐ = అయ్యి; కూడు = తినుటకు తిండి; నీరు = తాగుటకు నీరు; లేక = లేకపోవుటచేత; అధమవృత్తిన్ = భిక్షాటనచే; ఎందేని = ఎక్కడైనా; నలువదియెనిమిది = నలభైఎనిమిది (48); దివసముల్ = రోజులు; చరియింపన్ = గడపగా; ఒక = ఒకానొక; దివసంబు = రోజు; రేపు = ఉదయమున.
నెయ్యి = నెయ్యి; పాయసంబున్ = పరవాన్నము; నీరునున్ = మంచునీరు; కలిగినన్ = లభించగ; బహు = పెద్ద; కుటుంబ = సంసారము; భార = భారమువలని; భయమున్ = భయము; తోడన్ = తోటి; అలసి = అలసిపోయి; నీరుపట్టున్ = దాహము; ఆకలియును = ఆకలి; మిక్కిలి = అధికముగ; ఒదవన్ = కలుగగా; చూచి = కనుగొని; కుడువన్ = తినుటకు; ఉత్సహించె = సిద్ధపడెను.

భావము:

క్షత్రియశ్రేష్ఠుడా! పరీక్షిత్తూ! ఆ సంకృతి కొడుకు రంతిదేవుని యశస్సు ఏమి చెప్పగలం? విను. ఇహపరలోకాలలో ఆ రాజు తను కూడబెట్టిన సంపదలు సమస్తం ఎడతెగకుండా బీదలకు దానం చేసేసాడు. కడు పేదవాడై పెళ్ళం పిల్లలతో అన్నం నీళ్ళుదొరకక భిక్షాటనచేస్తూ నలభైఎనిమిది దినాలుగా గడపుతున్నా ధైర్యం కోల్పోలేదు. ఒకనాడు ఉదయం కొంత నెయ్యి, పరవాన్నం, మంచినీరు లభించాయి. పెద్ద సంసారభారంతో అలసి, ఆకలి దాహాలతో బాధపడుతూ, దొరికినవి తినడానికి సిద్ధపడుతున్నాడు.