పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : భరతుని చరిత్ర

  •  
  •  
  •  

9-640.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నితని పెంపు; కొడుకు లిరువురు జన్మించి
నుచు వెలయఁ జేయు నిన మమతఁ
బెంపఁజాల; నీవ పెంపు; భరింపు; మీ
ద్వాజు ననుచుఁ జనియె దాని విడిచి.

టీకా:

అన్న = అన్న యొక్క; ఇల్లాలిన్ = భార్యను; చూలాలినిన్ = గర్భవతిని; మమత = మమత అనెడి; ఆఖ్యన్ = పేరు కలామెను; చూచి = చూసి; బృహస్పతి = బృహస్పతి; సురతమున్ = రతిక్రీడ; కున్ = కు; తొరకొని = సిద్ధపడి; పైబడ్డన్ = మీదపడగా; తొల్లి = ముందుగ; గర్భంబునన్ = కడుపులో; ఉన్న = ఉన్నట్టి; బాలుడు = పిల్లవాడు; భయంబున్ = భయ; పొదవి = పడి; వలదు = వద్దు; తగదు = తగిన పని కాదు; అని = అని; మొఱజేయన్ = మొత్తుకొనగా; తమకంబున్ = మోహము; తోన్ = తోటి; వానిన్ = అతనిని; అంధుండవు = గుడ్డివాడవు; అగుము = అయిపొమ్ము; అన్నన్ = శపించగ; అలిగి = అలిగి; వాడు = అతను; యోని = ఉపస్థు; లోపలి = లోని; వీర్యమున్ = వీర్యమును; ఊడన్ = ఊడిపడిపోయేలా; తన్నినన్ = తన్నగా; నేలన్ = నేలమీద; పడి = పడిపోయి; బిడ్డడు = పిల్లవాడు; ఐ = అయ్యి; ఉన్నన్ = ఉండగా; పాయలేక = వదలలేక; ఇతనిన్ = ఇతనిని కూడ.
పెంపు = పెంచుము; కొడుకులు = పుత్రులు; ఇరువురు = ఇద్దరు; జన్మించిరి = పుట్టిరి; అనుచున్ = అనచెప్పి; వెలయన్ = నమ్మునట్లు; చేయుము = చెయ్యి; అనినన్ = అనగా; మమత = మమత; పెంచజాలన్ = పెంచలేను; నీవ = నీవే; పెంపు = పెంచుము; భరింపుము = భరించుము; ఈ = ఈ; ద్వాజున్ = ద్వాజుని; అనుచున్ = అనుచు; చనియెన్ = వెళ్ళిపోయెను; దానిని = దానిని; విడిచి = వదలివేసి.

భావము:

గర్భవతిగా ఉన్న అన్న ఉతథ్యుని భార్య మమతను చూసి బృహస్పతి రతిక్రీడకు సిద్ధపడి మీదపడ్డాడు. అప్పటికే కడుపులో ఉన్న పిల్లవాడు భయపడి “వద్దు. ఇది తగినపని కాదు” అని మొత్తుకొన్నాడు. తమకంతో ఉన్న బృహస్పతి అతనిని గుడ్డివాడివి అయిపొమ్మని శపించాడు. దానితో అలిగి అతను ఉపస్థు లోని వీర్యాన్ని ఊడిపడేలా తన్నగా, నేలమీద పిల్లవాడిగా పడ్డాడు. బృహస్పతి “ఇద్దరు పుత్రులు పుట్టారు అని చెప్పి నమ్మేలా చేసి, ఇతనిని పెంచు” అన్నాడు. కాని మమత “నేను పెంచలేను ఈ ద్వాజుని నీవే పెంచు.” అంటూ వానిని వదలేసి వెళ్ళిపోయింది.