పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : భరతుని చరిత్ర

  •  
  •  
  •  

9-639-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు విదర్భరాజపుత్రికలు శిశువులం జంపిన భరతుం డపుత్రకుండై మరుత్ స్తోమంబను యాగంబు పుత్రార్థియై చేసి, దేవతల మెప్పించె; నయ్యవసరంబున.

టీకా:

ఇట్లు = ఇలా; విదర్భరాజ = విదర్భరాజుయొక్క; పుత్రికలు = కుమార్తెలు; శిశువులన్ = పసిపిల్లలను; చంపినన్ = చంపివేయగా; భరతుండు = భరతుడు; అపుత్రకుండు = కొడుకులులేనివాడు; ఐ = అయ్యి; మరుత్ స్తోమంబు = మరుత్ స్తోమంబు; అను = అనెడి; యాగంబున్ = యజ్ఞమును; పుత్ర = కొడుకులను; అర్థి = కోరువాడు; ఐ = అయ్యి; చేసి = ఆచరించి; దేవతలన్ = దేవతలను; మెప్పించెను = మెప్పించను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు .

భావము:

ఇలా విదర్భరాకుమారీలు అయన తన భార్యలు పసిపిల్లలను చంపివేయడంతో భరతుడు అపుత్రకుడు అయ్యి, కొడుకుల కోసం మరుత్ స్తోమంబు అనే యాగం చేసి దేవతలను మెప్పించాడు. అప్పుడు.