పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : భరతుని చరిత్ర

  •  
  •  
  •  

9-638-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తుని భార్యలు మువ్వురు
రుసం బుత్రకులఁ గాంచి ల్లభుతోడన్
రిగారని తోడ్తోడను
శిములు దునుమాడి రాత్మ శిశువుల నధిపా!

టీకా:

భరతుని = భరతుని యొక్క; భార్యలు = భార్యలు; మువ్వురున్ = ముగ్గురు; వరుసన్ = వరసగా; పుత్రకులన్ = కొడుకులన్; కాంచి = కని; వల్లభు = భర్త; తోడన్ = తోటి; సరి = సమానమైనవారు; కారు = కారు; అని = అని; తోడ్తోడన్ = వెంటవెంటనే; శిరములున్ = తలలు; తునుమాడిరి = ఖండించిరి; ఆత్మ = తమ; శిశువులన్ = పుత్రులను; అధిపా = రాజా.

భావము:

మహారాజా! భరతుని ముగ్గురు భార్యలు వరసగా కొడుకులను కని, భర్త పేరు నిలబెట్టగలవారు కారు అని వెంటవెంటనే తమ బిడ్డల తలలు ఖండించారు.