పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : భరతుని చరిత్ర

  •  
  •  
  •  

9-637-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్థపతికంటెఁ గలిమిఁ గృ
తార్థుండై యతుల శౌర్య లవడియు నతం
ర్థములను బ్రాణములను
వ్యర్థము లని తలఁచి శాంతుఁ య్యె నరేంద్రా!

టీకా:

అర్థపతి = కుబేరుని; కంటెన్ = కంటె; కలిమిన్ = సంపదలతో; కృతార్థుండు = అనుకొన్నది సాధించువాడు; ఐ = అయ్యి; అతుల = సాటిలేని; శౌర్యమున్ = శౌర్యము; అలవడియున్ = కలిగి ఉండి; అతండు = అతను; అర్థములను = ధనములను; ప్రాణములను = ప్రాణములను; వ్యర్థములు = పనికిరానివి; అని = అని; తలచి = భావించి; శాంతుఁడు = శాంతము కలవాడు {శాంతము – కామక్రోధాది రాహిత్యము}; అయ్యెన్ = అయ్యెను; నరేంద్రా = రాజా.

భావము:

రాజా పరీక్షిత్తూ! పిమ్మట, కుబేరుని మించిన సంపదలు, అనుకున్నదెల్లా సాధించే సాటిలేని శౌర్యం ఉన్నా, భరతుడు అర్థప్రాణాలు వ్యర్థాలని గ్రహించి పరమ శాంతుడుగా అయ్యాడు.