పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : భరతుని చరిత్ర

  •  
  •  
  •  

9-634-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రెంవహరి క్రియ ధరణీ
మంలభారంబు నిజసమంచితబాహా
దంమున నిలిపి తనకును
భంనమున నెదురులేక రతుం డొప్పెన్.

టీకా:

రెండవ = రెండవ; హరి = విష్ణువు; క్రియన్ = వలె; ధరణీమండల = భూచక్రము; భారంబున్ = పరిపాలించెడి భారమును; నిజ = తన; సమంచిత = చక్కటి; బాహాదండమునన్ = భుజములపై; నిలిపి = ఉంచుకొని; తన = తన; కును = కు; భండనమునన్ = యుద్ధము నందు; ఎదురులేక = తిరుగులేకుండ; భరతుండు = భరతుడు; ఒప్పెన్ = విలసిల్లెను.

భావము:

ఆ భరతుడు రెండవ విష్ణువా అన్నట్లు భూభారం సర్వం తన భుజస్కంధాలపై ధరించి, యుద్ధంలో తనకు తిరుగన్నది లేకుండ భరతుడు విలసిల్లాడు.