పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : భరతుని చరిత్ర

  •  
  •  
  •  

9-633-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లశరీరవాణి సర్వభూతంబులకుఁ దేటపడ భరింపు మని పలికిన, నా కుమారుండు భరతుండయ్యె; నంత నా రాజు రాజవదన నంగీకరించి తనూభవుం జేకొని కొంతకాలంబు రాజ్యంబుజేసి పరలోకంబునకుం జనియె; తదనంతరంబ.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; అశరీరవాణి = అకాశవాణి; సర్వ = సమస్తమైన; భూతంబుల్ = ప్రాణులకు; తేటపపడన్ = తెలియునట్లుగ; భరింపుము = భరించుము; అని = అని; పలికినన్ = చెప్పుట చేత; ఆ = ఆ; కుమారుండు = బాలకుడు; భరతుండు = భరతుడు; అయ్యెన్ = అయ్యెను; అంతన్ = అంతట; ఆ = ఆ; రాజు = రాజు; రాజవదనన్ = పద్మవదనను; అంగీకరించి = ఒప్పుకొని; తనూభవున్ = పుత్రుని {తనూభవుడు - తనువున పుట్టినవాడు, కొడుకు}; చేకొని = స్వీకరించి; కొంతకాలంబున్ = కొన్నాళ్ళు; రాజ్యంబున్ = రాజ్యము; చేసి = పాలించి; పరలోకంబునకుంజనియె = పరలోకగతుడయ్యెను; తదనంతరంబునన్ = ఆ తరువాత.

భావము:

ఈ విధంగా అకాశవాణి అందరూ వినేలా “భరించుము” అని చెప్పుట చేత, ఆ బాలకుడు “భరతుడు”గా ప్రసిద్ధుడు అయ్యాడు. అంతట దుష్యంతమహారాజు పద్మవదన శకుంతలను పుత్రుని స్వీకరించి కొంతకాలం రాజ్యం పాలించి పరలోకగతుడు అయ్యాడు. అటు పిమ్మట.