పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : భరతుని చరిత్ర

  •  
  •  
  •  

9-632-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"దె నీ వల్లభ; వాఁడు నీ సుతుఁడు; భార్యాపుత్రులం బాత్రులన్
లంగా; దలనాఁటి కణ్వవనికా వైవాహికారంభముల్
ది నూహింపు; శకుంతలావచనముల్ మాన్యంబుగా భూవరేం
ద్ర! యం జేకొను" మంచు మ్రోసెను వియద్వాణీవధూవాక్యముల్.

టీకా:

అదె = అదిగో; నీ = నీ యొక్క; వల్లభ = భార్య; వాడు = అతడు; నీ = నీ యొక్క; సుతుడు = కొడుకు; భార్యా = పెళ్ళాము; పుత్రులన్ = కొడుకులను; పాత్రులన్ = యోగ్యులన్; వదలన్ = వదలిపెట్టుట; కాదు = తగినది కాదు; నాటి = ఆనాటి; కణ్వ = కణ్వుని; అవనికా = ఆరామము నందలి; వైవాహిక = వివాహమాడిన; ఆరంభముల్ = సంబరములను; మదిన్ = మనసు నందు; ఊహింపు = తలచుకొనుము; శకుంతల = శకుంతల యొక్క; ఆ = ఆ; వచనముల్ = మాటలు; మాన్యంబుగాన్ = గౌరవించునట్లు; భూవరేంద్ర = మహారాజ; దయన్ = కరుణతో; చేకొనుము = స్వీకరించుము; అంచున్ = అనుచు; మ్రోసెన్ = పలికెను; వియద్వాణీ = ఆకాశవాణి; వధూ = కల్యాణ; వాక్యముల్ = పలుకులు.

భావము:

ఆకాశవాణి “ఓ మహారాజా! అదిగో ఆమె నీ భార్య; అతడు నీ కొడుకు; యోగ్యులైన భార్యాపుత్రులను వదలిపెట్టుట తగిన పని కాదు. ఆనాటి కణ్వాశ్రమంలో వివాహమాడిన సంబరాలను మనసులో తలచుకో. శకుంతల మాటలు గౌరవించి దయతో ఆమెను స్వీకరించు.” అంటూ పలికింది.