పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : భరతుని చరిత్ర

  •  
  •  
  •  

9-630-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కేలన్ గురుచక్రరేఖయుఁ బదద్వంద్వంబునం బద్మరే
లు నొప్పారఁగ నందు వచ్చిన రమాకాంతుండు నాఁ గాంతి న
గ్గమై యున్న కుమారు మారసదృశాకారున్ విలోకించి తాఁ
లుకం డయ్యె విభం డెఱింగి సతి విభ్రాంతాత్మ యై యుండగన్.

టీకా:

వల = కుడి; కేలన్ = చేతిలో; గురు = గొప్ప; చక్రరేఖయున్ = చక్రము; పద = పాదముల; ద్వంద్వంబునన్ = రెంటి యందు; పద్మరేఖలు = పద్మములు; ఒప్పారగన్ = చక్కగా ఉండి; అందున్ = అక్కడకు; వచ్చిన = వచ్చినట్టి; రమాకాంతుండు = విష్ణుమూర్తి; నాన్ = వలె; కాంతిన్ = ప్రకాశముతో; అగ్గలము = అతిశయించినవాడు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నటువంటి; కుమారున్ = పుత్రుని; మార = మన్మథునితో; సదృశ = సమానమైన; ఆకారున్ = స్వరూపము కలవానిని; విలోకించి = చూసి; తాన్ = అతను; పలుకండు = మాట్లాడనివాడు; అయ్యెన్ = అయ్యెను; విభుండు = రాజు; ఎఱింగి = తెలిసినప్పటికి; సతి = భార్య; విభ్రాంత = తడబడెడి; ఆత్మ = మనసుకలామె; ఐ = అయ్యి; ఉండగన్ = ఉండగా.

భావము:

కుడి చెతిలో చక్రం, పాదాలు రెంటిలోను పద్మం గుర్తులతో విష్ణుమూర్తిలా ప్రకాశిస్తూ మన్మథాకారుడిలా ఉన్న కొడుకు ఎదురుగా వచ్చి ఉన్ననూ, మాట్లాడని తన భర్త దుష్యంతుని చూసి శకుంతల తడబడి మనసులో విచారించింది.