పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : భరతుని చరిత్ర

  •  
  •  
  •  

9-628-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఆ పిన్నవాని నతుల
వ్యాపారు నుదారు వైష్ణవాంశోద్భవునిం
జూపెద" నంచు శకుంతల
భూపాలునికడకు వచ్చెఁ బుత్రుని గొనుచున్.

టీకా:

ఆ = ఆ; పినవాని = పిల్లవాడిని; అతుల = సాటిలేని; వ్యాపారున్ = సాహసవంతుని; ఉదారున్ = గొప్పవానిని; వైష్ణవ = విష్ణుమూర్తి యొక్క; అంశ = అంశతో; ఉద్భవునిన్ = పుట్టనివానిని; చూపెదన్ = చూపించెదను; అంచున్ = అనుచు; శకుంతల = శకుంతల; భూపాలుని = రాజు; కడ = వద్ద; కున్ = కు; వచ్చెన్ = వచ్చెను; పుత్రునిన్ = కొడుకును; కొనుచున్ = తీసుకొని.

భావము:

“సాటిలేని సాహసవంతుడు, వైష్ణవాంశ సంభూతుడు అయిన ఈ పిల్లవాడిని చూపిస్తాను” అంటూ శకుంతల దుష్యంతమహారాజు దగ్గరకి కొడుకును తీసుకొని వచ్చింది.