పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : భరతుని చరిత్ర

  •  
  •  
  •  

9-625-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత నా కణ్వమునీంద్రుండు బాలకుం జూచి శకుంతల కిట్లనియె.

టీకా:

అంతన్ = అంతట; ఆ = ఆ; కణ్వ = కణ్వుడు అనెడి; ముని = ఋషులలో; ఇంద్రుండు = శ్రేష్ఠుడు; బాలకున్ = పిల్లవానిని; చూచి = కనుగొని; శకుంతల = శకుంతల; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను .

భావము:

అప్పుడు, ఆ కణ్వమహర్షి ఆ బాలుడి నేర్పులు చూసి, శకుంతలతో ఇలా అన్నాడు.