పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సుద్యుమ్నాదుల చరిత్ర

  •  
  •  
  •  

9-40-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఖిలాత్ముఁ డగుచున్న రియందుఁ, బరునందు;-
క్తితోఁ జాలఁ దత్పరత మెఱసి,
యూర్ధ్వరేతస్కుఁ డై యున్న ప్రాణులకెల్ల-
నాప్తుఁడై, సర్వేంద్రిములు గెల్చి,
సంగంబునకుఁ బాసి, శాంతుండు నపరిగ్ర-
హుండునై, కోరక యుండి, తనకు
చ్చిన యదియ జీనము గావించుచుఁ-
నుఁదాన నిలుపుచు, న్యబుద్ధి

9-40.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డుని తెఱగున, నంధుని చందమునను,
జెవిటి భంగిని, మహి నెల్లఁ జెల్లఁ దిరిగి,
డవులకు నేఁగి, కార్చిచ్చునందుఁ జొచ్చి
చిక్కి, నియతుఁడై బ్రహ్మంబుఁ జెందె నతఁడు.

టీకా:

అఖిలాత్ముడు = సర్వవ్యాపి; అగుచున్న = అయినట్టి; హరి = విష్ణుని; అందున్ = ఎడల; పరున్ = పరమాత్మ; అందున్ = ఎడల; భక్తి = భక్తి; తోన్ = తోటి; చాలన్ = అధికమైన; తత్పరతన్ = మనసులగ్నముచేసి; మెఱసి = ప్రకాశించి; ఊర్ధ్వరేతస్కుడు = కామవ్యాపారమును జయించినవాడు {ఊర్ధ్వరేతస్కుడు - అథఃపతనము లేకపోవుటచేత స్తంభింపబడిన శుక్లము కలవాడు, సనకాది, ఋషి}; ఐ = అయ్యి; ఉన్న = జీవించియున్నసమస్త; ప్రాణులు = జీవుల; కిన్ = కి; ఎల్లన్ = అన్నిటికిని; ఆప్తుడు = ఇష్టుడు; ఐ = అయ్యి; సర్వ = ఎల్ల; ఇంద్రియములు = ఇంద్రియములను; గెల్చి = అదుపుచేసి; సంగంబున్ = తగులముల; కున్ = కు; పాసి = దూరమై; శాంతుండున్ = శాంతగుణముగలవాడు; అపరిగ్రహుండు = విషయమువంకబోనివాడు; ఐ = అయ్యి; కోరక = కోరికలులేకుండగ; ఉండి = ఉండి; తన = అతని; కున్ = కి; వచ్చిన = ఏది లభించిన; అదియ = అదే; జీవనము = జీవనాధారముగ; కావించుచున్ = చేసి; తనుదానన్ = తననుతానే; నిలుపుచు = నిగ్రహించుకొనుచు; ధన్య = తృప్తిచెందిన; బుద్ధి = బుద్ధితో.
జడుని = మూగవాని; తెఱంగునన్ = వలె; అంధుని = గుడ్డివాని; చందమునను = వలె; చెవిటి = చెవిటివాని; భంగినిన్ = వలె; మహిన్ = లోకమునందు; ఎల్లన్ = అన్నిచోట్లను; తిరిగి = సంచరించి; అడవులు = అడవులు; కున్ = కు; ఏగి = వెళ్ళి; కార్చిచ్చు = దావానలము; అందున్ = లో; చొచ్చి = పడి; చిక్కి = చిక్కుపోయి; నియతుడు = నియమముతప్పనివాడు; ఐ = అయ్యి; బ్రహ్మంబున్ = పరబ్రహ్మను; చెందెన్ = కలిసెను; అతడు = అతడు.

భావము:

సర్వవ్యాపి, పరమాత్మ అయిన విష్ణుని ఎడల భక్తి పెంచుకుని, కామాన్ని జయించాడు. ఊర్ధ్వరేతస్కుడు అయ్యి జీవకోటులు సమస్తానికి ఇష్టుడు అయ్యాడు. ఇంద్రియములను అదుపుచేసి, తగులములకు దూరమై, శాంతగుణము గలవాడై, విషయముల వంక బోక, నిష్కాముడై, తనకు లభించిన దానినే జీవనాధారముగ చేసుకొనుచు, తననుతానే నిగ్రహించుకొనుచు తృప్తిగా జీవించాడు. మూగవాడిలా, గ్రుడ్డివాడిలా, చెవిటి వాడిలా నలుచెరగులా తిరిగాడు. చివరికి అడవిలో కార్చిచ్చులో పడి పరబ్రహ్మలో లీనమయ్యాడు.