పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సుద్యుమ్నాదుల చరిత్ర

  •  
  •  
  •  

9-38-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పెంజీకటి మ్రోలఁ గాన కడిదం బంకించి శార్దూల మం
చా పుల్లావు శిరంబుఁ ద్రుంచి, తెగదో యంచుం, బులిన్ వెండియున్
వాపోవం దెగ వ్రేసి, భూవరుఁడు ద్రోవన్ ఖడ్గరక్తంబుచేఁ
బైపై గీయుచుఁ, జేరి చూచెఁ దల ద్రెవ్వంబడ్డ యద్ధేనువున్.

టీకా:

ఆ = ఆ; పెంజీకటిన్ = కారుచీకట్లో; మ్రోలన్ = ముందు, ఎదురుగా; కానక = కనబడక; అడిదంబున్ = కత్తిని; అంకించి = ఆడించి; శార్దూలము = పెద్దపులి; అంచున్ = అనుచు; ఆ = ఆ; పుల్లావు = కపిలధేనువు; శిరంబున్ = తలను; త్రుంచి = ఖండించి; తెగదో = తెగలేదేమోనని; అంచున్ = అనుచు; పులిన్ = పెద్దపులిని; వెండియున్ = మరల; వాపోవంగన్ = అరచుతుండగ; తెగవ్రెసి = ఖండించి; భూవరుడున్ = రాజు; త్రోవన్ = దారిలో; ఖడ్గ = కత్తియొక్క; రక్తంబున్ = రక్తమును; చేన్ = చేతితో; పైపైన్ = మెల్లిగా; గీయుచున్ = తుడుస్తూ; చేరి = దగ్గరకెళ్ళి; చూచెన్ = చూసెను; తల = శిరస్సు; త్రెవ్వంబడ్డ = ఖండింపబడిన; ఆ = ఆ; ధేనువున్ = ఆవును.

భావము:

ఆ కారుచీకట్లో ఎదురుగా ఉన్నవి కనబడక, అతను పెద్దపులి పెద్దపులి అని అరుస్తూ కత్తితో ఒక కపిలధేనువు తల ఖండించాడు. తెగలేదేమోనని అనుకుని, పెద్దపులి అని మరల అరస్తూ మళ్ళీ కత్తితో నరికాడు. ఆ పృషధ్రుడు దారిలో కత్తికున్న రక్తం చేతితో మెల్లిగా తుడుస్తూ దగ్గరకెళ్ళి చూస్తే, ఏముంది శిరస్సు ఖండింపబడినది కపిల ఆవు కనబడింది.