పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సుద్యుమ్నాదుల చరిత్ర

  •  
  •  
  •  

9-32-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అతనికి నుత్కళుండును, గయుండును, విమలుండును నను కొడుకులు మువ్వురు గలిగి, ధర్మపరులై యుత్తరాపథంబునకు రాజులైరి; సుద్యుమ్నుండు ముదుసలి యయి ప్రతిష్ఠానపురంబు విడిచి, పురూరవునకు భూమి నిచ్చి, వనంబునకుం జనియె; నివ్విధంబున.

టీకా:

అతని = అతని; ఉత్కళుండును = ఉత్కళుడు; గయుండును = గయుడు; విమలుండును = విమలుడు; అను = అనెడి; కొడుకులు = పుత్రులు; మువ్వురు = ముగ్గురు; కలిగి = జన్మించి; ధర్మపరులు = ధర్మవర్తనులు; ఐ = అయ్యి; ఉత్తరా = ఉత్తరపు; పథంబున్ = భూముల; కున్ = కు; రాజులున్ = ప్రభువులుగా; ఐరి = అయితిరి; సుద్యుమ్నుండు = సుద్యుమ్నుడు; ముదుసలి = ముసలివాడు; అయి = ఐ; ప్రతిష్టానపురంబు = ప్రతిష్టానపురమును; విడిచి = వదలిపెట్టి; పురూరవున్ = పురూరవుని; కిన్ = కి; భూమిని = రాజ్యమును; ఇచ్చి = ఇచ్చివేసి; వనంబున్ = అడవి; కున్ = కి; చనియెన్ = వెళ్ళెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగా.

భావము:

అలా సుద్యుమ్నుడికి ఉత్కళుడు, గయుడు, విమలుడు అని ముగ్గురు పుత్రులు జన్మించి ధర్మవర్తనులు అయ్యి ఉత్తరపు భూములకు ప్రభువులుగా అయ్యారు. సుద్యుమ్నుడు ముసలివాడై తను ఇలగా బుధునికి జన్మనిచ్చిన పురూరవునికి రాజ్యమును ఇచ్చి ప్రతిష్టానపురం వదలిపెట్టి వానప్రస్థానికి అడవికి వెళ్ళిపోయాడు.