పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సుద్యుమ్నాదుల చరిత్ర

  •  
  •  
  •  

9-31-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గువ యగుచు మరల గవాఁడు నగుచును
భూధాత్రి యంత నాతఁ డేలెఁ
బ్రజలు సంతసింప బాహాబలముతోడఁ
గురుని కరుణఁ జేసి కువలయేశ!

టీకా:

మగువ = స్త్రీ; అగుచున్ = అవుతూ; మరల = మళ్ళీ; మగవాడు = పురుషుడు; అగుచును = అగుచూ; భూతధాత్రిన్ = నేలను {భూతధాత్రి - భూత (జీవులను) ధాత్రి (ధరించునది), భూమి}; అంతన్ = సమస్తమును; ఆతడున్ = అతను; ఏలెన్ = పరిపాలించెను; ప్రజలున్ = లోకులు; సంతసింపన్ = సంతోషపడునట్లుగా; బాహాబలము = భుజబలము; తోడన్ = తోటి; గురుని = గురువుయొక్క; కరుణన్ = దయ; చేసి = వలన; కువలయేశ = రాజా {కువలయేశ - కువలయము (భూమి)కి ఈశుడు (ప్రభువు), రాజు}.

భావము:

రాజా పరీక్షిత్తు! గురువు దయ వలన, తన భుజబలం తోటి, నెల మార్చి నెల స్త్రీ అవుతూ మళ్ళీ పురుషుడు అవుతూ రాజ్యం పరిపాలిస్తూ లోకులను సంతోషపెట్టేవాడు.