పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సుద్యుమ్నాదుల చరిత్ర

  •  
  •  
  •  

9-29-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వచ్చి సుద్యుమ్నుండు మగవాఁడగు కొఱకు, నమ్మునిపుంగవుండు శంకరు నారాధింప, నీశ్వరుండును దపసి ప్రయాసంబునకు సంతసిల్లి, యిట్లనియె.

టీకా:

వచ్చి = అలావచ్చి; సుద్యుమ్నుండు = సుద్యుమ్నుడు; మగవాడు = పురుషుడు; అగు = అగుట; కొఱకున్ = కోసము; ఆ = ఆ; ముని = ఋషులలో; పుంగవుండు = శ్రేష్ఠుడు; శంకరున్ = పరమశివుని; ఆరాధింపన్ = పూజించగా; ఈశ్వరుండును = పరమశివుడు; తపసి = ఋషియొక్క; ప్రయాసంబున్ = పూనిక; కున్ = కు; సంతసిల్లి = సంతోషించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా వచ్చిన వసిష్ఠ ఋషిశ్రేష్ఠుడు ఇలాసుందరి సుద్యుమ్నుడుగా పురుషుడుగా మరల మారడం కోసం పరమశివుని పూజించాడు. పరమశివుడు సంతోషించి ఈ విధంగ పలికాడు.