పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సుద్యుమ్నాదుల చరిత్ర

  •  
  •  
  •  

9-28-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుసుతుండు ఘనుఁడు గనాలి తనమునఁ
గొడుకుఁ గాంచి, విసివి, కుందికుంది,
చింతఁ బొంది, గురు వసిష్ఠుని భావించె,
తని తలఁపుతోన తఁడు వచ్చె.

టీకా:

మను = మనువుయొక్క; సుతుండు = పుత్రుడు; ఘనుడు = గొప్పవాడు; మగనాలితనమునన్ = స్త్రీత్వముతోనున్న; కొడుకున్ = కుమారుని; కాంచి = చూసి; విసివి = విసిగిపోయి; కుందికుంది = మిక్కిలికుంగిపోయి; చింతన్ = బాధ; పొంది = పడి; గురు = గురువు; వసిష్ఠుని = వసిష్ఠుని; భావించెన్ = తలచుకొనెను; అతని = అతనియొక్క; తలపు = భావము; తోనన్ = వెంటనే; అతడు = అతడు; వచ్చెన్ = వచ్చెను.

భావము:

మహానుభావుడైన మనువు తన పుత్రుడు స్త్రీత్వముతో విహరించుట చూసి విసిగి, వేసారి గురువు వసిష్ఠుని తలచుకొన్నాడు. వసిష్ఠుడు వెంటనే వచ్చాడు.