పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సుద్యుమ్నాదుల చరిత్ర

  •  
  •  
  •  

9-27-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లలరువిల్తుని నెఱబిరుదు చిగురు టడిదంబు మొనకు నోహటించి, వారలిరువురుం బైపడి వేడుకలకుం జొచ్చిన, వారలకుం బురూరవుం డను కుమారుండు పుట్టె; నివ్విధంబున.

టీకా:

ఇట్లు = ఇలా; అలరువిల్తుని = మన్మథుని {అలరువిలుతుడు - అలరు (అరవిందాది పుష్పములు) విలుతుడు (బాణములుగలవాడు), మన్మథుడు}; నెఱబిఱుదున్ = గట్టి శౌర్యముతో; చిగురు = చిగురాకు అనెడి; అడిదంబు = బాకు; మొన = కొన; కున్ = కి; ఓహటించి = ఓడి; వారలు = వారు; ఇరువురన్ = ఇద్దరు; పైబడి = రతిక్రియల; వేడుకల్ = క్రీడించుటల; కున్ = కు; చొచ్చిన = మొదలిడగా; వారల్ = వారి; కున్ = కు; పురూరవుండు = పురూరవుడు; అను = అనెడి; కుమారుండు = పుత్రుడు; పుట్టెన్ = పుట్టెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగా.

భావము:

ఇలా మన్మథుని చిగురాకు దాడికి లొంగి పరస్పరం వరించిన వారు ఇద్దరు క్రీడించసాగారు. వారికి పురూరవుడు అనెడి పుత్రుడు పుట్టాడు. ఇలా......