పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సుద్యుమ్నాదుల చరిత్ర

  •  
  •  
  •  

9-25-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు చెలికత్తియల మొత్తంబులుం, దానును, నా రాచపూఁబోడి వాఁడిచూపుల నాఁడు పోఁడిమి నెఱపుచు, దైవయోగంబున సోమ సుతుండును, భగవంతుడును నగు బుధుని యాశ్రమంబు జేరి, మెలఁగుచున్న యెడ.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; చెలికత్తియల = సేవకురాళ్ళ; మొత్తంబులున్ = సమూహములును; తానును = తను; ఆ = ఆ; రాచపూబోడి = రాకుమారి {రాచపూబోడి - రాచ (రాజ) పూబోడి (స్త్రీ), రాకుమారి}; వాడిచూపులన్ = కోరచూపులతో; ఆడుపోడిమ = స్త్రీత్వము; నెఱపుచు = కనబరుస్తూ; దైవయోగంబునన్ = దైవఘటనవలన; సోమ = చంద్రుని; సుతుండును = కుమారుడును; భగవంతుడును = పూజ్యనీయుడు; అగు = ఐన; బుధుని = బుధునియొక్క; ఆశ్రమంబున్ = ఆశ్రమమునకు; చేరి = ప్రవేశించి; మెలగుచున్న = విహరించుచున్నట్టి; ఎడన్ = సమయమునందు.

భావము:

ఒక దినము సేవకురాళ్ళతో సహా ఆ రాకుమారి వాడిచూపులతో స్త్రీవిలాసాలు కనబరుస్తూ దైవఘటనవలన చంద్రుడి కుమారుడు అయిన బుధుడి ఆశ్రమం ప్రవేశించి విహరించసాగింది. ఆ సమయములో.....