పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సుద్యుమ్నాదుల చరిత్ర

  •  
  •  
  •  

9-24-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఈ నెల వెవ్వఁడు జొచ్చిన
మానిని యగు" ననిన తొంటి మాట కతమునన్,
మావుఁడు మగువ పోఁడిమి
మాక పేరడవులందు ఱియుం దిరిగెన్.

టీకా:

ఈ = ఈ; నెలవు = ప్రదేశమును; ఎవ్వడు = ఎవరైననుసరే; చొచ్చిన = ప్రవేశించినచో; మానిని = స్త్రీ; అగును = అయిపోవును; అనిన = అనినట్టి; తొంటి = పూర్వపు; మాట = వచనము; కతమునన్ = ప్రకారము; మానవుడు = పురుషుడు; మగువపోడిమి = స్త్రీత్వము; మానక = తప్పకపొంది; పేరడవుల్ = కారడవుల; అందున్ = లో; మఱియున్ = ఇంక; తిరిగెను = వసించెను.

భావము:

“ఈ ప్రదేశంలోకి ఎవరు ప్రవేశించినా వారు అందరు స్త్రీలు అయిపోవుదురు గాక.” ఆ శంకరుని వచనము ప్రకారము ప్రద్యుమ్నుడు స్త్రీత్వము పొంది రాకుమారిగా కారడవులలో నివసించసాగాడు.