పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సుద్యుమ్నాదుల చరిత్ర

  •  
  •  
  •  

9-23-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అది కారణంబుగా, భగవంతు డగు శివుండు దన ప్రియురాలి వేడుకల కొఱకు నిట్లని వక్కాణించె.

టీకా:

అదికారణంబుగాన్ = అందుచేత; భగవంతుండు = పరమశివుడు {భగవంతుడు - అష్టైశ్వర్యములుగల పూజ్యుడు, శివుడు}; అగు = అయిన; శివుండు = పరమశివుడు; ప్రియురాలి = భార్య; వేడుకలు = వినోదము; కొఱకున్ = కోసము; ఇట్లు = ఇలా; అని = అని; వక్కాణించెను = ప్రకటించెను.

భావము:

అందుచేత, పరమశివుడు భార్య వినోదం కోసం ఇలా అని ప్రకటించాడు.