పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సుద్యుమ్నాదుల చరిత్ర

  •  
  •  
  •  

9-18-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రాజుఁ తోటివారు మణు లై రంటివి;
కాంత లగుట యేమి కారణమున?
నిట్టి దేశ మెఱుఁగ మెన్నఁడు; నా కథల్
వేడ్కదీర నాకు విస్తరింపు.

టీకా:

రాజు = రాజు; తోటివారు = కూడనున్నవారు; రమణులు = స్త్రీలు {రమణి - రమణీయమైనామె, సుందరి}; ఐరి = అయినారు; అంటివి = అన్నావు; కాంతలు = స్త్రీలు; అగుటన్ = అయిపోవుట; ఏమి = ఎట్టి; కారణమునన్ = కారణముచేత; ఇట్టి = ఇటువంటి; దేశమున్ = ప్రదేశమును; ఎఱుగము = తెలియదు; ఎన్నడున్ = ఎప్పుడుకూడ; ఆ = ఆయొక్క; కథల్ = కథలను; వేడ్కన్ = కుతూహలము; తీరన్ = తీరునట్లుగ; నా = నా; కున్ = కు; విస్తరింపు = వివరించుము.

భావము:

“రాజు, అతని వెంట ఉన్నవారు స్త్రీలు అయిపోయారు అన్నావు. ఎందుకని అలా స్త్రీలు అయిపోయారు. ఇలాంటి ప్రదేశం గురించి ఎప్పుడు విన లేదు. ఆ కథలను వివరంగా చెప్పుము.