పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సుద్యుమ్నాదుల చరిత్ర

  •  
  •  
  •  

9-17-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు మగతనంబు చెడి మగువలై యొండొరుల మొగంబులు చూచి మఱుఁగుచుండి" రనిన విని శుకునకు రాజిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; మగతనంబు = పురుషత్వము; చెడి = కోల్పోయి; మగువలు = స్త్రీలు; ఐ = అయ్యి; ఒండొరులన్ = ఒకరికొకరు; మొగంబులున్ = ముఖములను; చూచి = చూసుకొని; మఱుగుచుండిరి = ఉడికిపోతుండిరి; అనిన = అనగా; విని = విని; శుకున్ = శుకుని; కున్ = కి; రాజు = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ విధముగ మగతనం పోయి స్త్రీలు అయిపోయిన వాళ్లు అందరు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుని ఉడికిపోతున్నారు.” అనగా విని రాజు శుకమునితో ఇలా పలికెను.