పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సుద్యుమ్నాదుల చరిత్ర

  •  
  •  
  •  

9-16.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జేరె; నందు మహేశుండు శివయు నెపుడు
తి సలుపుచుందు; రందుఁ జొరంగఁ బోవ
నాఁడుదయ్యెను రాజు; రాజానుచరులుఁ
డఁతులైరి; తదశ్వంబు డబ యయ్యె.

టీకా:

ప్రొద్దుపోక = కాలముగడవక; ఒక = ఒక; నాడు = దినమున; పోయి = వెళ్ళి; పేరడువులన్ = పెద్ద అడవుల; వెంట = వెంబడి, అమ్మట; వేటాడుచున్ = వేటాడుతు; వేడ్క = ఉత్సాహము; తోడన్ = తోటి; కొందఱు = కొంతమంది; మంత్రులు = మంత్రులు; కూడ = కూడా; రాన్ = వస్తుండగా; సైంధవంబు = ఉత్తమజాతిది {సైంధవము - సింధుదేశమునపుట్టినది, ఉత్తమజాతిగుఱ్ఱము}; అయిన = ఐన; గుఱ్ఱమును = గుఱ్ఱమును; ఎక్కి = అధిరోహించి; అందమైన = సుందరమైన; పలు = పెద్ద; విల్లు = విల్లును; క్రొవ్వు = మిక్కిలి; వాడి = వాడియైన; బాణంబులును = బాణములను; తాల్చి = ధరించి; పెను = పెద్దపెద్ద; మెకంబుల = మృగముల; వెంట = వెంబడి; బిఱుసు = గట్టిదనము; తోడను = తోటి; ఉత్తర = ఉత్తరపు; దిశను = దిక్కునందు; మహా = మిక్కిలి; ఉగ్రుడు = భయంకరుడు; ఐ = అయ్యి; చనిచని = చాలాదూరమువెళ్ళి; మేరువు = మేరుపర్వతము; పొంతన్ = దగ్గరలోని; కుమారవనమున్ = కుమారవనమును; చేరెన్ = ప్రవేశించెను; అందు = దానిలో.
మహేశుండు = పరమశివుడు {మహేశుడు - మహా ఈశ్వరుడు, శివుడు}; శివయున్ = పార్వతీదేవి {శివ - శివునిభార్య, పార్వతి}; ఎపుడున్ = ఎల్లప్పుడు; రతి = మన్మథక్రీడ; సలుపుచున్ = జరుపుకొనుచు; ఉందురు = ఉండెదరు; అందున్ = దానిలో; చొరంగ = ప్రవేశించి; పోవన్ = వెళ్ళగా; ఆడుది = స్త్రీ; అయ్యెన్ = అయిపోయెను; రాజు = రాజు; రాజానుచరులున్ = రాజుతోవెళ్ళినవారు; పడతులు = స్త్రీలు; ఐరి = అయిపోయిరి; తత్ = అతని యొక్క; అశ్వంబున్ = గుఱ్ఱముకూడ; బడబ = ఆడుగుఱ్ఱము; అయ్యె = అయిపోయెను.

భావము:

కొంత కాలం తరువాత, సుద్యుమ్నుడు మంత్రులను వెంట పెట్టుకుని గొప్ప గుఱ్ఱాన్ని ఎక్కి ఉత్సాహంగా వేటకోసం తన నగరం ప్రతిష్టానపురం నుండి బయలుదేరాడు. ఉత్తరపు దిక్కులో పెద్ద విల్లు మిక్కిలి వాడియైన బాణములను ధరించి అడవులలో వేటాడుతు ఉన్నాడు. అలా పెద్దపెద్ద మృగాల పాలిటి భీకరుడు అయ్యి. చాలా దూరం వెళ్ళి మేరుపర్వతం దగ్గరలోని కుమారవనం ప్రవేశించాడు. అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా విహరిస్తూ ఉంటారు. ఆ కుమారవనంలో ప్రవేశించగానే రాజు, రాజుతో వెళ్ళినవారు అందరు స్త్రీలు అయిపోయారు. అతని గుఱ్ఱము కూడ ఆడుగుఱ్ఱము అయిపోయింది..