పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సుద్యుమ్నాదుల చరిత్ర

  •  
  •  
  •  

9-14-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ధిప! సంకల్ప వైషమ్య గుటఁ జేసి
హోతకల్లతనంబుననువిదగలిగె
నైనఁగలిగింతు నీకుఁబ్రియాత్మజునిగ
నీవు మెచ్చంగఁజూడు నా నేర్పుబలిమి."

టీకా:

అధిప = రాజా; సంకల్ప = సంకల్పమంత్రపఠనములో; వైషమ్యము = తేడా; అగుటన్ = జరుగుట; చేసి = వలన; హోత = హోతయొక్క; కల్లతనంబు = వంచనబుద్ధివలన; ఉవిద = ఇంతి; కలిగెన్ = పుట్టినది; ఐనన్ = అయినను; కలిగింతున్ = చేసెదను; నీ = నీ; కున్ = కు; ఆత్మజునిగ = పుత్రునిగా; నీవున్ = నీవు; మెచ్చంగన్ = మెచ్చునట్లు; చూడు = చూడుము; నా = నా; నేర్పు = సామర్థ్యముయొక్క; బలిమి = శక్తిని.

భావము:

“రాజా! సంకల్పమంత్ర పఠనములో తేడా జరుగుట వలన హోత వంచనబుద్ధి వలన ఆడపిల్ల పుట్టింది. అయినా, పరవాలేదు లే. నీకు నచ్చేలా పుత్రునిగా చేస్తాను చూడు నా శక్తి సామర్థ్యాలు.”