పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సుద్యుమ్నాదుల చరిత్ర

  •  
  •  
  •  

9-13-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుంగాక; మీరు బ్రహ్మవాదులరు; మంత్రవాదులరుఁ; బాపంబు లందకుండం జేయించువా; రిది యేమి?” యనవుడు మా తాత వసిష్ఠుండు హోతృవ్యభిచారం బెఱింగి, మనువున కిట్లనియె.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండగ; మీరు = తమరు; బ్రహ్మవాదులరు = బ్రహ్మజ్ఞానులు; మంత్రవాదులరు = మంత్రవేత్తలు; పాపంబులు = పాపములు; అందకుండన్ = అంటుకోకుండ; చేయించువారు = కర్మలుచేయించువారు; ఇది = ఇలాజరిగినది; ఏమి = ఎందుచేత; అనవుడు = అనగా; మా = మా; తాత = ముత్తాత; వసిష్ఠుండు = వసిష్ఠుడు; హోతృ = హోతయొక్క; వ్యభిచారంబు = విధిని యతిక్రమించుట; ఎఱింగి = తెలిసికొని; మనువున్ = మనువున; కిన్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

తమరు బ్రహ్మజ్ఞానులు, మంత్రవేత్తలు, పాపస్పర్శ లేకుండా కర్మలు చేయించువారు. ఎందుచేత ఇలా జరిగింది.” అనగా మా ముత్తాత వసిష్ఠుడు హోత చేసిన పని తెలిసికొని మనువుతో ఇలా అన్నాడు.