పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : సుద్యుమ్నాదుల చరిత్ర

  •  
  •  
  •  

9-10.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హోత పెడచేత నిల యను నువిద పుట్టె
దానిఁ బొడగని మనువు సంతాప మంది,
"కొడుకుమేల్ గాక; యేటికిఁ గూతు? రకట
చెప్పవే" యని పోయె వసిష్ఠుకడకు.

టీకా:

మనువు = (వైవత్స) మనువు; బిడ్డలు = పుత్రులు; పుట్టన్ = కలుగుటకు; మఖమున్ = యజ్ఞమును; ఆచరించుచోన్ = చేయునప్పుడు; అతని = అతని యొక్క; భార్యయున్ = పెండ్లాము; హోతన్ = హోతను {హోత - హోమము (అగ్నికర్మను) చేయువాడు}; ఆశ్రయించి = చేరి; కూతురు = పుత్రిక; పుట్టన్ = కలుగునట్లు; నా = నా; కున్ = కు; చేయుము = చేయవలసినది; అని = అని; పల్కి = అడిగి; వర = ఉత్తమమైన; భక్తిన్ = భక్తి; తోన్ = తోటి; పయోవ్రతమున్ = పయోవ్రతమును {పయోవ్రతము - నీరుమాత్రము తీసుకొనెడి ఉప్పోషము, నిరాహార వ్రతము}; సలిపె = చేసెను; ఆ = ఆ; సతి = స్త్రీ; చెప్పిన = అడిగిన; అట్ల = ఆ విధముగ; అధ్వర్యుడును = అధ్వర్యుడు {అధ్వర్యుడు - యాగమునందు అధ్వర్యము చేయు ఋత్వికుడు, యాజి}; హోతన్ = హోతను; అగుగాక = కానిమ్ము; వేలుపుము = హోమముచేయుము; అనుచున్ = అంటూ; పలికెన్ = చెప్పెను; హవిస్ = హోమద్రవ్యమును {హవిస్సు - 1హోమము చేయుటకైన ఇగురబెట్టిన అన్నము 2నెయ్యి}; అందుకొని = తీసుకొని; కూతురు = పుత్రిక; అయ్యెడుము = కలుగుగాక; అని = అని; వషట్కారంబు = వషట్కారములు {వషట్కారము - వేల్చునపుడు హవిస్సు త్యాగము చేయుచు వౌషట్ అని పలుకుట}; చెప్పుచున్ = పలుకుతు; కదిసి = చేరి; వేల్వన్ = ఆహుతిచేయగా.
హోత = హోతయొక్క; పెడచేతన్ = తప్పుపనివలన; ఇల = ఇల; అనున్ = అనెడి; ఉవిద = ఇంతి, స్త్రీ; పుట్టెన్ = కలిగినది; దానిన్ = దానిని; పొడగని = చూసి; మనువు = ఆ మనువు; సంతాపము = బాధ; అంది = పడి; కొడుకున్ = పుత్రుడుకలిగిన; మేల్ = మంచిది; కాక = అలాకాకుండగ; ఏటికి = ఎందుచేత; కూతురున్ = పుత్రికకలిగినది; అకట = అయ్యో; చెప్పవే = తెలుపుము; అని = అనుకొని; పోయెన్ = వెళ్ళెను; వసిష్ఠున్ = వసిష్ఠుని; కడ = వద్ద; కున్ = కు.

భావము:

వైవస్వత మనువు పుత్రుల కోసం యజ్ఞము చేసేటప్పుడు అతని భార్య దితి హోతను పుత్రిక పుట్టేలా చేయమని అడిగింది. భక్తిగా పయోవ్రతమును చేసింది. అధ్వర్యుడు హోమ ద్రవ్యమును పుత్రిక కలుగుగాక అని వషట్కారములు పలుకుతుండగా ఆహుతిచేసాడు. ఆ హోత తప్పుపనివలన ఇల అనెడి ఇంతి కలిగింది. ఆమెను చూసి మనువు బాధ పడి “పుత్రుడు కాకుండగ పుత్రిక ఎందుకు కలిగింది” అనుకొని వసిష్ఠుని వద్దకు వెళ్ళాడు.