పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దుష్యంతుని చరిత్రము

  •  
  •  
  •  

9-617-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నివార్యప్రభ మున్ను మేనకయు విశ్వామిత్రభూభర్తయుం
ని; రా మేనక డించిపోయెనడవిం; ణ్వుండు నన్నింతగా
నిచెన్; సర్వము నామునీంద్రుఁ డెఱుఁగున్; ద్భాగధేయంబునన్
నినుఁగంటిం బిదపం గృతార్థ నగుచున్ నేఁడీ వనాంతంబునన్.

టీకా:

అనివార్య = అమోఘమైన; ప్రభన్ = తేజస్సుతో; మున్ను = పూర్వము; మేనకయున్ = మేనక; విశ్వామిత్ర = విశ్వామిత్రుడనెడి; భూభర్తయున్ = రాజు; కనిరి = కన్నారు; మేనక = మేనక; డించి = వదలి; పోయెన్ = వెల్లపోయినది; అడవిన్ = అడవియందు; కణ్వుండు = కణ్వుడు; నన్నున్ = నన్ను; ఇంత = ఇంతదానిని; కాన్ = అగునట్లు; మనిచెన్ = పెంచెను; సర్వమున్ = సమస్తము; ఆ = ఆ; ముని = ఋషులలో; ఇంద్రుండు = ఉత్తముడు; ఎఱుగున్ = తెలియును; మత్ = నా యొక్క; భాగదేయంబునన్ = సౌభాగ్యము వలన; నినున్ = నిన్ను; కంటిన్ = చూసితిని; పిదపన్ = తరువాత; కృతార్థన్ = ధన్యురాలను; అగుచున్ = అగుచు; నేడు = ఇవాళ; ఈ = ఈ; వన = అడవి; అంతంబునన్ = లోపల.

భావము:

“పూర్వం విశ్వామిత్ర మహారాజు అమోఘమైన తేజస్సుతో మేనక నన్ను కన్నది. ఆ మేనక అడవిలో వదలి తన లోకానికి వెళ్ళిపోయింది. కణ్వమహర్షి చూసి అన్నీ తానై నన్ను పెంచాడు. ఇవాళ ఈ అడవిలో నా అదృష్ట వశాత్తు నిన్ను చూసాను, ధన్యురాలను అయ్యాను.