పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దుష్యంతుని చరిత్రము

  •  
  •  
  •  

9-614-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలుకుచున్న రాజకుమారుని వదనచంద్రికారసంబు నేత్ర చకోరంబులవలనం ద్రావుచు, నయ్యువిద విభ్రాంతయై యున్న సమయంబున.

టీకా:

అని = అని; పలుకుచున్న = అడుగుతున్న; రాజకుమారుని = రాకుమారుని; వదన = మోము అనెడి; చంద్రికా = చంద్రుని యొక్క; రసంబున్ = వెన్నెలను; నేత్ర = కన్నులు అనెడి; చకోరంబుల = చకోరపక్షుల; వలనన్ = వలన; త్రావుచున్ = తాగుతూ; ఆ = ఆ; యువిద = వనిత; విభ్రాంత = వివశ; అయి = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; సమయంబునన్ = సమయము నందు.

భావము:

ఇలా అడుగుతున్న రాకుమారుని ముఖంలోని వెన్నెలను తన కన్నులు అనె చకోరపక్షుల వలన తాగుతూ, ఆమె తడబడే సమయంలో.