పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దుష్యంతుని చరిత్రము

  •  
  •  
  •  

9-603-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇందిందిరాతిసుందరి
యిందిందిరచికుర యున్న దిందింద; శుభం
బిం దిందువంశ; యను క్రియ
నిందీవరవీథి మ్రోసె నిందిందిరముల్.

టీకా:

ఇందిందిర = లక్ష్మీదేవి; అతి = కంటెనెక్కువ; సుందరి = అందమైనామె; ఇందిందిర = తుమ్మెదలవంటి; చికుర = ముంగురులుకలామె; ఉన్నది = ఉంది; ఇందిందన్ = దగ్గరలోనే; శుభంబు = మంచిజరుగును; ఇందు = ఇక్కడ; ఇందువంశ = చంద్రవంశస్తుడా; అను = అనుచున్న; క్రియన్ = విధముగ; ఇందీవర = నల్ల కలువల; వీథిన్ = సమూహమునందు; మ్రోసెన్ = ఝంకారముచేసినవి; ఇందిందిరముల్ = మధుపములు .

భావము:

“ఓ చంద్రవంశోద్ధారకా! లక్ష్మీదేవికంటె అందగత్తె, తుమ్మెదల వంటి ముంగురులు గల సుందరి శకుంతల ఇక్కడే ఉంది. ఇక్కడ నీకు శుభం కలుగుతుంది.” అన్నట్లుగా కలువపూలల్లో తిరుగుచున్న తుమ్మెదలు ఝంకారాలు చేశాయి.