పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : దుష్యంతుని చరిత్రము

  •  
  •  
  •  

9-597-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మృయూథంబుల వెంటను
మృలాంఛన సన్నిభుండు మృగయాతురుఁడై
మృయులు గొందఱు గొలువఁగ
మృరాజపరాక్రమంబు మెఱయఁగ వచ్చెన్.

టీకా:

మృగ = జంతువుల; యూథంబుల = సమూహముల; వెంటన్ = వెనుక; మృగలాంఛన = చంద్రునితో {మృగలాంఛనుడు - లేడి చిహ్నముగా కలవాడు, చంద్రుడు}; సన్నిభుండు = సమానుడు; మృగయా = వేట యందు; ఆతురుడు = తొందరకలవాడు; ఐ = అయ్యి; మృగయులు = వేటగాళ్ళు; కొందఱున్ = కొంతమంది; కొలువన్ = సేవించుతుండగా; మృగరాజ = సింహ; పరాక్రమంబున్ = పరాక్రమము; మెఱయగన్ = ప్రకాశించుచుండగా; వచ్చెన్ = చరించెను.

భావము:

దుష్యంత రాజచంద్రుడు వేట తమకంతో, వేటగాళ్ళు సేవిస్తుండగా, సింహ పరాక్రమం ప్రకాశిస్తుండగా జంతువుల వెంట పడి వేటాడసాగాడు.