పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పూరుని చరిత్ర

  •  
  •  
  •  

9-592-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"భాత! నీవు జనించిన
పూరుని వంశంబునందుఁ బుట్టినవారిం
జారు యశోలంకారుల
ధీరుల వినిపింతు నధిక తేజోధనులన్.

టీకా:

భారత = పరీక్షిన్మహారాజా {భారత - భరతవంశమున పుట్టినవాడ, పరీక్షిత్తు}; నీవున్ = నీవు; జనించిన = పుట్టినట్టి; పూరుని = పూరుని యొక్క; వంశంబున్ = వంశము; అందున్ = లో; పుట్టిన = జన్మించినట్టి; వారిన్ = వారిని; చారు = చక్కటి; యశస్ = కీర్తి అనెడి; అలంకారులన్ = అలంకారములు కలవారిని; ధీరులన్ = ధీరస్వభావుల; వినిపింతున్ = చెప్పెదను; అధిక = మిక్కిలి; తేజస్ = తేజస్సు అనెడి; ధనులన్ = సంపద కలవారిని.

భావము:

"ఓ భరత వంశపు పరీక్షిన్మహారాజా! ఇంక నీవు పుట్టిన పూరుని వంశములోని కీర్తిమంతులను, ధీరస్వభావులను, తేజోసంపన్నులను గురించి చెప్తాను.