పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : యయాతి బస్తోపాఖ్యానము

  •  
  •  
  •  

9-578-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముదిసెను దంతావళియును
ముదిసెను గేశములు దనువు ముదిసెం దనకున్
ముదియ నివి రెండు చిక్కెను
బ్రదికెడి తీపియును విషయక్ష స్పృహయున్.

టీకా:

ముదిసెను = రాలిపోతున్నవి; దంతాళియును = పళ్ళు; ముదిసెను = వెలిశిపోయాయి; కేశములున్ = వెంట్రుకలు; తనువున్ = శరీరము; ముదిసెన్ = వడలిపోయినది; తన = తన; కున్ = కు; ముదియనివి = వడలనివి; రెండున్ = రెండు (2); చిక్కెను = మిగిలిపోయినవి; బ్రతికెడి = ప్రాణములపై; తీపియునున్ = తీపి; విషయ = గ్రామ్యసుఖముల; పక్ష = పట్ల; స్పృహయున్ = కోరిక.

భావము:

పళ్ళు రాలిపోతున్నాయి. వెంట్రుకలు వెలిసిపోయాయి. శరీరము వడలిపోయింది. కాని వడలకుండా ప్రాణాలపై తీపి గ్రామ్యసుఖాలపై కోరిక అనే రెండు మాత్రమే మిగిలిపోయాయి.