పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : యయాతి బస్తోపాఖ్యానము

  •  
  •  
  •  

9-571-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పలికినఁ బలుకులు పలుకఁడు
లఁచున్ నవకాంతఁ జూచి డు సంచలుఁడై
నిలిచిన చోటన్ నిలువఁడు
నిలువెల్లను గల్ల కామి నిజమరి గలఁడే."

టీకా:

పలికినన్ = అడిగితే; పలుకులు = సమాధానము; పలుకడు = చెప్పడు; కలచున్ = ఎగబడును; నవ = కొత్త; కాంతన్ = యువతిని; చూచి = చూసి; కడున్ = మిక్కిలి; సంచలుడు = చంచలచిత్తుడు; ఐ = అయ్యి; నిలిచినన్ = నిలిచిన; చోటన్ = చోట; నిలువడు = నిలబడడు; నిలువు = మనిషి పొడుగు; ఎల్లన్ = అంతా; కల్ల = మోసమే; కామి = కాముకులలో; నిజమరి = సత్యవంతుడు; కలడే = ఉన్నాడా.

భావము:

“అడిగితే సమాధానము ఉలకడు పలకడు. కొత్తదాన్ని చూస్తే ఎగబడతాడు. చంచలచిత్తుడు, నిలకడ లేదు, నిలువునా మోసం కాముకత్వం. ఇలాంటి సత్యవంతుడు ఎక్కడైనా ఉంటాడా?”