పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పూరువు వృత్తాంతము

  •  
  •  
  •  

9-564-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చెలికాండ్రం గరులన్ రథమ్ముల భటశ్రేణిం దురంగంబులం
లోఁగన్న ధనావళిన్ సమములంగాఁ జూచుచున్ భార్యతో
లు వేలేండ్లు మనోజభోగలహరీర్యాప్తుఁడై తేలియున్
లుతృష్ణం గడఁగాన కెంతయు మహాబంధంబులన్ స్రుక్కుచున్.

టీకా:

చెలికాండ్రన్ = ఆప్తులను; కరులన్ = ఏనుగుల బలగమును; రథమ్ములన్ = రథముల బలగమును; భటశ్రేణిన్ = కాల్బలములను; తురంగంబులన్ = అశ్వ బలములను; కల = స్వప్నము; లోన్ = అందు; కన్న = చూసిన; ధనాళిన్ = సంపదలతో; సమములన్ = సమానమైనవాని; కాన్ = అయినట్లు; చూచుచున్ = చూస్తూ; భార్య = పెండ్లాము; తోన్ = తోటి; పలు = అనేక; వేల = వేలకొలది; ఏండ్లున్ = సంవత్సరములు; మనోజ = మన్మథ; భోగ = సుఖ; లహరీ = తరంగములలో; పర్యాప్తుడు = తృప్తుడు; ఐ = అయ్యి; తేలియున్ = ఓలలాడినను; పలు = మిక్కిలి; తృష్ణన్ = మోహము; కడన్ = తుది; కానక = చూడలేక; ఎంతయున్ = అత్యధికముగ; మహాబంధంబులన్ = లౌకిక బంధములలో; స్రుక్కుచున్ = చిక్కిపోతూ.

భావము:

ఆప్తులు, ఏనుగులు, రథాలు, అశ్వాలు, భటులు సర్వం కలలో కనుపించిన సంపదలు అయినట్లు చూస్తూ, భార్యతో అనేక వేల సంవత్సరాలు మన్మథసౌఖ్యాలలో ఓలలాడసాగాడు. అలా మిక్కిలి తృష్ణతో లౌకిక బంధాలలో సతమతం కాసాగాడు.