పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పూరువు వృత్తాంతము

  •  
  •  
  •  

9-562-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కాశంబున మేఘబృందము ఘనంబై సన్నమై దీర్ఘమై
యేకంబై బహురూపమై యడఁగు నట్లేదేవుగర్భంబులో
లోశ్రేణి జనించుచున్ మెలఁగుచున్ లోపించు నా దేవు సు
శ్రీకాంతున్ హరిఁగూర్చి యాగములు చేసెన్ నాహషుం డిమ్ములన్.

టీకా:

ఆకాశంబునన్ = నింగిని; మేఘ = మబ్బుల; బృందమున్ = గుంపు; ఘనంబు = పెద్దవి; ఐ = అయ్యి; సన్నము = చిన్నవిగ; ఐ = అయ్యి; దీర్ఘము = పొడవైనవి; ఐ = అయ్యి; యేకంబు = ఒకటే; ఐ = అయిపోయి; బహు = అనేక; రూపము = స్వరూపములవి; ఐ = అయ్యి; అడగున్ = అణగు; అట్లున్ = ఆవిధముగ; ఏ = ఏ; దేవు = భగవంతుని; గర్భంబు = కడుపు; లోన్ = లోపల; లోక = భువనముల; శ్రేణి = సముదాయములు; జనించుచున్ = పుట్టునో; మెలగుచున్ = ప్రవర్తిల్లునో; లోపించుచున్ = లయమైపోవునో; ఆ = ఆ; దేవు = భగవంతుని; సుశ్రీకాంతున్ = నారాయణుని {సుశ్రీకాంతుడు - సు (శుభకరమైన) శ్రీ (లక్ష్మీదేవి) కాంతున్ (భర్త), విష్ణువు}; హరిన్ = నారాయణుని; గూర్చి = గురించి; యాగముల్ = యజ్ఞములు; చేసెన్ = ఆచరించెను; నాహుషుండు = యయాతి {నాహుషుడు - నహుషుని పుత్రుడు, యయాతి}; ఇమ్ములన్ = ప్రీతితో.

భావము:

ఆకాశంలో మబ్బులు దట్టం అవుతూ, పెద్దవి అవుతూ, చిన్నవి అవుతూ, పొడవైనవి, పొట్టివి అవుతూ రకరకా రూపాలు పొందుతూ అణిగిపోతూ ఉంటాయో, అదే విధంగ భగవంతుని కడుపులో సకల భువనాలు పుట్టుతూ, ప్రవర్తిల్లుతూ, లయవుతూ ఉంటాయి. ఆ శ్రీకాంతుని గురించి యయాతి ప్రీతితో యాగాలు చేసాడు.