పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పూరువు వృత్తాంతము

  •  
  •  
  •  

9-560-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డౌ ద్వీపము లేడు వాడలుగ సర్వేలాతలంబెల్లఁ బె
న్వీడై పోఁడిమి నేలుచుం బ్రజల నన్వేషించి రక్షించుచుం
దోడన్ భార్గవి రా మనోజసుఖసంతోషంబులం దేలుచుం
గ్రీడించెన్ నియతేంద్రియుం డగుచు నా క్రీడాతిరేకంబులన్.

టీకా:

ఏడు = ఏడు (7); ఔ = ఐనట్టి; ద్వీపముల్ = ద్వీపములు {సప్తద్వీపములు - 1జంబూ 2ప్లక్ష 3శాల్మలీ 4కుశ 5క్రౌంచ 6శాక 7పుష్కర ద్వీపములు}; ఏడు = ఏడు (7); వాడలు = పేటలు; కన్ = అయినట్లు; సర్వ = సమస్తమైన; ఇలాతలంబున్ = భూమండలమును; ఎల్లన్ = అంతటిని; పెన్ = పెద్ద; వీడు = రాజ్యముగా; ఐ = చేసుకొని; పోడిమిన్ = చక్కటి పద్ధతులతో; ఏలుచున్ = పరిపాలించుతు; ప్రజలన్ = ప్రజలను; అన్వేషించి = పరిశీలించి; రక్షించుచున్ = కాపాడుతు; తోడన్ = తోడునీడగా; భార్గవి = దేవయాని; రాన్ = వస్తుండగా; మనోజ = మన్మథ {మనోజుడు - మనసున పుట్టువాడు, మన్మథుడు}; సుఖ = సౌఖ్యములు; సంతోషంబులన్ = ఆనందములలో; తేలుడున్ = తేలియాడుచు; క్రీడించెను = విహరించెను; నియతేంద్రియుండు = ఇంద్రియలోలుడు; అగుచున్ = అగుచు; ఆ = ఆ; క్రీడా = విహరణలలో; అతిరేకంబులన్ = అతిశయములతో.

భావము:

యయాతి సప్తద్వీపాలను ఏడు పేటలు అయినట్లు సమస్త భూమండలాన్ని తన ఏకఛత్రాధిపత్యం కిందకి తెచ్చుకున్నాడు. అంత పెద్ద రాజ్యాన్ని చక్కటి పద్ధతులతో, ప్రజలను తోడునీడగా కాపాడుతు, పరిపాలించసాగాడు. అనేక విహరణలు, మన్మథ సౌఖ్యాలు, ఆనందాలలో దేవయానిని ఓలలాడించాడు.