పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

నవమ స్కంధము : పూరువు వృత్తాంతము

  •  
  •  
  •  

9-553-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పిన్నవుగాని నీవు కడుఁబెద్దవు బుద్ధుల యందు రమ్ము నా
న్న! మదాజ్ఞ దాఁటవుగ న్న! వినీతుఁడ వన్న! నీవు నీ
న్నలు చెప్పినట్లు పరిహారము చెప్పకు మన్న! నా జరన్
న్నన దాల్చి నీ తరుణిమం బొనగూర్చుము నాకుఁ బుత్రకా!"

టీకా:

పిన్నవున్ = చిన్నవాడవు; కాని = కాని; నీవున్ = నీవు; కడున్ = మిక్కిలి; పెద్దవాడవు = పెద్దవాడవు; బుద్దులన్ = మంచిబుద్దుల; అందున్ = విషయములో; రమ్ము = రా; నా = నా; అన్న = తండ్రి; మత్ = నా యొక్క; ఆజ్ఞన్ = ఉత్తరువును; దాటవుగద = తోసిపుచ్చవుకదా; అన్న = నాయనా; వినీతుడవు = అణకువ కలవాడవు; అన్న = నాయనా; నీవున్ = నీవు; నీ = నీ యొక్క; అన్నలున్ = పెద్దసోదరులు; చెప్పిన = చెప్పిన; అట్లున్ = విధముగ; పరిహారము = తోసిపుచ్చుచు; చెప్పుకుము = చెప్పవద్దు; అన్న = తండ్రి; నా = నా యొక్క; జరన్ = ముసలితనమును; మన్ననన్ = మన్నించి; తాల్చి = గ్రహించి; నీ = నీ యొక్క; తరుణిమన్ = యౌవనమును; ఒనగూర్చుము = కలిగించుము; నా = నా; కున్ = కు; పుత్రకా = కుమారా.

భావము:

“నాయనా! నా తండ్రి! అందరిలోకి చిన్నవాడవు. కాని, మంచి బుద్దుల విషయంలో ఉత్తముడవు, అణకువ కలవాడవు. నా ఉత్తరువును తోసిపుచ్చవు కదా. నీ అన్నలవలె నీవు తోసిపుచ్చవద్దు. నా ముసలితనాన్ని మన్నించి తీసుకుని, నీ యౌవనాన్ని నాకు ఇమ్ము.”